విధాత: ఆదివారం జరిగిన మా మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గత ఆరు నెలల నుండి మా అధ్యక్ష పదవి కి ప్రకాష్ రాజు మంచు విష్ణు లో పోటీ పడగా 107 ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందారు వీరిద్దరు వల్ల ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే ప్రకాష్ రాజు కు మెగా ఫ్యామిలీ అండగా ఉంటుందని ప్రచారం జోరుగా సాగింది ప్రకాష్ రాజ్ […]
విధాత: ఆదివారం జరిగిన మా మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గత ఆరు నెలల నుండి మా అధ్యక్ష పదవి కి ప్రకాష్ రాజు మంచు విష్ణు లో పోటీ పడగా 107 ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందారు వీరిద్దరు వల్ల ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే ప్రకాష్ రాజు కు మెగా ఫ్యామిలీ అండగా ఉంటుందని ప్రచారం జోరుగా సాగింది ప్రకాష్ రాజ్ గెలుపు సులువే అన్న చందంగా తయారై గెలుపు సులువే అని అందరూ భావించారు ప్రకాష్ రాజు ప్రత్యర్థి మంచు విష్ణు తండ్రి నటుడు మోహన్ బాబుకు చిరంజీవికి గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్న సంగతి ఇటు ఇండస్ట్రీ ఏ కాక 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు అయితే చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజు కు ఉంటుందని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ గెలుపుని అందరూ ఊహించే ఉంటారు
మా ఎలక్షన్ నామినేషన్ పూర్తి అయిన తర్వాత నుండి అనేక పరిణామాలు జరిగాయి మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒక దశలో పవన్ కళ్యాణ్ పై కూడా మంచు విష్ణు ఆరోపణలు చేయగా దానిని ప్రకాష్ రాజ్ జీవిత రాజశేఖర్ లు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా వ్యూహాత్మకంగా మంచు విష్ణు ఆంధ్ర రాజకీయాన్ని వాడుకున్నారు మంచు విష్ణు భార్య వేరోనికా స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూతురు వరుసకు చెల్లెలు కావడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు పెద్దలని ప్రభావితం చేసి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు విజయానికి కారణమయ్యారని సినీ ఇండస్ట్రీ లో ని పెద్దలు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ తో సినీ ఇండస్ట్రీకి విడదీయరాని అనుబంధం ఉన్నదని చెప్పక తప్పదు పెద్ద సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు సినిమా అనుమతుల కోసం కూడా సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది వీటన్నిటికి నడుమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలు చెప్పిన విధంగా మంచు విష్ణు విజయానికి పాటుపడ్డారు
కాగా మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ మొదటి నుంచి వివాదాస్పదంగా నిలిచాడు తాను మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న దగ్గర్నుంచి అతనిపై ప్రాంతీయ వాద ముద్ర వేశారు స్వయంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజు ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు బాహాటంగానే విమర్శించారు అయితే ప్రకాష్ రాజ్ తాను నటుడని తనకు ప్రాంతీయ వాద ముద్ర వెంటనే ఆయన ప్రత్యర్థులకు కు సమాధానమిచ్చారు ఏది ఏమైనా సాధారణ ఎన్నికలను తలపించిన మా మూవీ ఎన్నికలు ఇండస్ట్రీని ఎటు వైపు తీసుకు పోతుందోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.