Dies Irae Trailer : ప్రణవ్ మోహన్ లాల్ మూవీ ‘డీయస్ ఈరే’ ట్రైలర్ విడుదల
ప్రణవ్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ థ్రిల్లర్ ‘డీయస్ ఈరే’ తెలుగు ట్రైలర్ విడుదల. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది.
విధాత : మలయళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘డీయస్ ఈరే’ చిత్రం నుంచి మేకర్స్ తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. నవంబర్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ జోరు పెంచిన చిత్ర బృందం తెలుగు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
హర్రర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రానున్న ‘డీయస్ ఈరే’ చిత్రం నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించినట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ తో ‘తీర్పునిచ్చే రోజు.. ఆకాశం, భూమి.. బూడిదవుతాయి.. లోకం భయంతో కన్నీళ్లతో నిండుతుంది’ అంటూ ప్రణవ్ తన డైలాగులతో ఆకట్టుకుంటున్నారు. ఉత్కంఠభరితంగా ఉన్న మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు రేపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram