Raj Tarun|రాజ్ త‌రుణ్ ప‌రిస్థితి మ‌రీ ఇంత దారుణంగా మారిందేంటి..ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ రెండు బెడిసి కొట్టాయి..!

Raj Tarun| గ‌త కొద్ది రోజులుగా రాజ్ త‌రుణ్ పేరు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. లావ‌ణ్య అనే యువ‌తిని ప్రేమించి ఆమెతో కొన్నాళ్ల‌పాటు రిలేష‌న్‌లో కూడా ఉన్న రా

  • By: sn    cinema    Aug 05, 2024 8:45 AM IST
Raj Tarun|రాజ్ త‌రుణ్ ప‌రిస్థితి మ‌రీ ఇంత దారుణంగా మారిందేంటి..ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ రెండు బెడిసి కొట్టాయి..!

Raj Tarun| గ‌త కొద్ది రోజులుగా రాజ్ త‌రుణ్ పేరు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. లావ‌ణ్య అనే యువ‌తిని ప్రేమించి ఆమెతో కొన్నాళ్ల‌పాటు రిలేష‌న్‌లో కూడా ఉన్న రాజ్ త‌రుణ్ ఆమెకి క‌డుపు చేసి అబార్ష‌న్ చేయించాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా లావ‌ణ్య‌నే చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తనకి దూరం అయిపోతున్నాడని కొందరు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకుంటున్నాడ‌ని, నా రాజ్ త‌రుణ్ నాకు కావాల‌ని లావ‌ణ్య ఫైట్ చేస్తుంది. ఇక లావ‌ణ్య‌.. రాజ్ తరుణ్‌పై కేసు పెట్ట‌డం, ప‌లు మీడియా ఛానెల్స్ చుట్టూ తిరుగుతూ రాజ్ త‌రుణ్‌కి సంబంధించిన అనేక విష‌యాల‌ని లీక్ చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

అయితే లావ‌ణ్య లీక్ చేస్తున్న విష‌యాల‌కి రాజ్ త‌రుణ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. చాల రోజుల త‌ర్వాత తిర‌గ‌బ‌డ‌రా సామి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ కోసం బ‌య‌ట‌కి వ‌చ్చిన రాజ్ త‌రుణ్ మీడియాతో ప‌లు విష‌యాల గురించి ముచ్చ‌టించాడు. అయిన కూడా రాజ్ త‌రుణ్‌పై ట్రోలింగ్ ఆగ‌లేదు. ఇక ఇదే స‌మ‌యంలో రాజ్ త‌రుణ్ న‌టించిన రెండు సినిమాలు షార్ట్ గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. కొన్ని రోజుల క్రితం పురుషోత్తముడు చిత్రం విడుదలయింది. ఆ చిత్రాన్ని ఆడియన్స్ పట్టించుకోలేదు.ఇక ఈ వివాదానికి కారణం అయిన తిరగబడరా సామీ చిత్రం రీసెంట్‌గా రిలీజ అయింది.

ఈ సినిమా స‌మ‌యంలోనే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మధ్య ప్రేమ చిగురించింది అని.. ఆమె వ‌ల్ల‌నే రాజ్ తరుణ్ తనని పక్కన పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. అయితే రీసెంట్ గా విడుదలైన తిర‌గ‌బ‌డ‌రా సామీ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఒక‌వైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో న‌లిగిపోతున్న రాజ్ త‌రుణ్‌కి రెండు సినిమాలు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. రెండిట్లో ఒక చిత్రం హిట్ అయి ఉన్నా కూడా ఈ వివాదం కాస్త అట‌కెక్కి ఉండేదేమో అని జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తంలో చిన్న చిన్న వివాదాల్లో రాజ్ తరుణ్ పేరు వినిపించేది. అయితే అవేమి అతడి కెరీర్ ని ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన లావణ్య వ్యవహారం మాత్రం రాజ్ తరుణ్ ని కుదుపు కుదిపేసింది అనే చెప్పాలి.