Ram Charan Meets Modi | ప్రధాని మోదీతో రామచరణ్ దంపతుల భేటీ
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఆర్చరీ లీగ్ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీని న్యూఢిల్లీలో కలిశారు.

విధాత: మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత్ లో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి. ఈ లీగ్ సక్సెస్ ను పురస్కరించుకుని ఉపాసన, రామ్ చరణ్ లు మోదీని కలిసినట్లుగా వారు ఇన్ స్ట్రాలో పేర్కోన్నారు. ఇకపోతే అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా ఉపాసన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తరుచూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు ఆమెను కో చైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.