ప్రేమించడం లేదని తుపాకీతో కాల్పులు జరిపి వీరంగం చేసిన యువకుడు

విధాత:ప్రేమ పేరుతో యువతులను వేధిస్తూన్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించలేదని యువతులపై దాడికి దిగుతున్నారు యువకులు. రెచ్చిపోయి యాసిడ్ పోయడం….కత్తితో దాడి చేస్తున్న ఘటనలు ప్రేమోన్మాదానికి ఉదాహరణలు. ప్రేమించాలని వెంటపడుతారు…నువ్వు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగడుతారు. ప్రేమించలేదన్న కోపం మద్యం మత్తులో ఉన్మాదంతో మైనర్ బాలికలపై దాడికి దిగుతున్నారు. చిత్తూరు జిల్లా మారుమూల పల్లెలో తాజాగా నాటుతుపాకీ కాల్పుల కలకలం తాజాగా వెలుగు చూసింది. మైనర్ బాలిక ఇంటి […]

ప్రేమించడం లేదని తుపాకీతో కాల్పులు జరిపి వీరంగం చేసిన యువకుడు

విధాత:ప్రేమ పేరుతో యువతులను వేధిస్తూన్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించలేదని యువతులపై దాడికి దిగుతున్నారు యువకులు. రెచ్చిపోయి యాసిడ్ పోయడం….కత్తితో దాడి చేస్తున్న ఘటనలు ప్రేమోన్మాదానికి ఉదాహరణలు. ప్రేమించాలని వెంటపడుతారు…నువ్వు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగడుతారు. ప్రేమించలేదన్న కోపం మద్యం మత్తులో ఉన్మాదంతో మైనర్ బాలికలపై దాడికి దిగుతున్నారు. చిత్తూరు జిల్లా మారుమూల పల్లెలో తాజాగా నాటుతుపాకీ కాల్పుల కలకలం తాజాగా వెలుగు చూసింది. మైనర్ బాలిక ఇంటి వద్ద మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు ఓ యువకుడు. ఇదేంటని అడిగిన వారిపై నాటు తుపాకులతో కాల్పులకు యత్నించాడు ఆ ఉన్మాది.

అసలు కథలోకి వెళితే చిత్తూరు . జిల్లాలోని బైరెడ్డి పల్లె మండలం కడపనత్తం గ్రామంలో చాన్ అలియాస్ ఖాదర్ బాషా వృత్తిరీత్యా టైలర్. బట్టలు కుట్టుకుంటూ….అమ్మ, నాన్నలతో కలసి జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై మనస్సు పడ్డాడు. ప్రేమించాలంటూ వెంటపడుతూ వచ్చాడు. నువ్వు ఒప్పుకోకపోతే ఆత్మహత్యా చేసుకుంటానంటూ బెదిరించాడు. అయినా ఆ మైనర్ బాలిక లొంగలేదు…..అసలు ఖాదర్ అలియాస్ చాన్ ను ప్రేమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఉన్మాదిగా మారిన చాన్ బాషా అమ్మాయిని మరింత వేధింపులకు గురిచేస్తూ….రోడ్డుపై వెళ్తున్న ఆ మైనర్ పై అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఈల వేయడం…చెయ్యి పట్టుకొని లాగటంతో వేధింపుల విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.యువతీ తల్లి చాన్ భాషను మందలించే ప్రయత్నం చేసింది.అయినా ఆ యువకుడు వేధింపులు మాత్రం ఆపక పోవడంతో… ఊరి పెద్దల వద్దకు పంచాయితిని తీసుకెళ్లారు. పెద్దల సమక్షంలోనే….చాన్ భాషపై దాడికి దిగింది యువతీ తల్లి. అసలే ప్రేమించలేదన్న కోపంతో పాటు యువతీ తల్లి అందరి ముందు దాడి చేయడం చాన్ కోపంతో ఊగిపోయాడు.

ReadMore:ప్రేమ జంట ఆత్మహత్య

యువతీ ఇంటి వద్దకు వెళ్లి నాటు తుపాకీతో కలకలం సృష్టించాడు. యువతీ తల్లిపై గొడవకు దిగాడు….ఇంతలోనే పొరిగింటిలో నివాసం ఉంటున్న దినేష్ గొడవను నిలువరుంచే ప్రయత్నం చేసాడు. దీంతో ఆగ్రహించిన చాన్ దినేష్ పై కాల్పులు జరిపాడు. దినేష్ తృటిలో ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. నాటు తుపాకీ నుంచి పేలిన నల్ల మందు ఇంటి గోడకు తాకింది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కాల్పులు జరపడంతో తుపాకుల తూటా శబ్దంకు గ్రామం గజగజ వణికింది. విషయం తెసులుకున్న పోలీసులు ఘటన స్థానికి చేరుకున్నారు. చాన్ భాషాను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు పోలీసులు.నాటు తుపాకీ ఎలా లభ్యం అయింది…. తయారు చేసి ఇచ్చిన ఎవరు అంటూ దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికపై బెదిరింపులు పాల్పడటంతో ఫోక్సో చట్టముక్రింద ఎఫ్ఐ ఆర్ నమోదు చేసారు.