Hyderabad Engineering Student Suicide | ర్యాగింగ్ భూతానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలి

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ బాధలతో బీటెక్ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య.. సీనియర్ల వేధింపులపై ఆగ్రహం.

Hyderabad Engineering Student Suicide | ర్యాగింగ్ భూతానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలి

విధాత, హైదరాబాదా్ : ఇంజనీరింగ్ కోర్సు చదివి తల్లితండ్రులను గొప్పగా చూసుకోవాలని పట్నం వచ్చిన ఓ పేద విద్యార్థి ఆశలను ర్యాగింగ్ భూతం చిదిమేసింది. సీనియర్ల ర్యాగింగ్ కు తాళలేక తల్లితండ్రులకు ఆత్మహత్య సందేశం వీడియో పెట్టిన ఆ నిరుపేద విద్యార్థి తనువు చాలించాడు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అదిలాబాద్ ఉట్నూర్ కు చెందిన సాయి తేజ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు చెందిన మేడిపల్లి హాస్టలో ఉంటున్న సాయి తేజను సీనియర్లు, స్థానిక యువకులతో కలిసి కొట్టి, బార్‌కు తీసుకెళ్లి రూ.15 వేల బిల్లు చెల్లించాలని వేధించారు. తన తల్లి తండ్రులు కూలి పని చేసుకుంటారని..మా వద్ద అంత డబ్బు లేదని సాయితేజ్ వారికి చెప్పిన వినిపించుకోకుండా అతడిని వేధించారు. విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పగా..అతను రూ.1500 ఫోన్ పే ద్వారా సాయితేజకు పంపించాడు. ఐనప్పటికి సీనియర్లు, స్థానిక యువకులు సాయితేజను తీవ్రంగా వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయి తేజ తన తండ్రికి వీడియో పంపి హాస్టల్‌లో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనలో కళాశాల యజమాన్యం నిర్లక్ష్యంపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.