చెన్నూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి రోడ్డులో గోదావరి నది ఒడ్డున గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు

– 42 మంది జూదరుల అరెస్టు
– 2.51 లక్షల నగదు, 12 కార్లు,
43 సెల్ ఫోన్లు, రెండు చార్జింగ్ లైట్లు స్వాధీనం

విధాత ప్రతినిధి,ఉమ్మడి ఆదిలాబాద్: చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి రోడ్డులో గోదావరి నది ఒడ్డున గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు. కొంత మంది వ్యక్తులు పేకాట (అందర్ బాహర్) ఆడుతున్నూరనే నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు సీఐ వాసుదేవరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. గోదావరిఖని, ఏన్టీపీసీ , రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాలకు చెందిన 42 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2.51 లక్షల నగదు, 12 కార్లు, 43 సెల్ ఫోన్లు, రెండు చార్జింగ్ లైట్లు స్వాధీనపర్చుకొని వారిపై కేసు నమోదు చేశారు.