Rachakonda Police Seize Ganja | పుష్పా తరహాలో గంజాయి రవాణ..పోలీసుల తనిఖీలో పట్టివేత

హైదరాబాద్‌లో పుష్పా సినిమా తరహాలో గంజాయి రవాణా; డీసీఎం లో 11 క్వింటాళ్ల గంజాయి సీజ్, నిందితులు అదుపులోకి.

Rachakonda Police Seize Ganja | పుష్పా తరహాలో గంజాయి రవాణ..పోలీసుల తనిఖీలో పట్టివేత

విధాత, హైదరాబాద్ : పుష్పా సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న వ్యవహారానికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద కొత్తగూడ దగ్గర 11 క్వింటాళ్ల గంజాయిని తనిఖీల్లో భాగంగా పట్టుకున్న పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.6కోట్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాహనంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

సిమెంటు బ్యాగు మధ్య గంజాయి అక్రమ రవాణా

సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. డీసీఎం వాహనంలో 70 బ్యాగులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిక్రెట్ సెల్ లో గంజాయిని దాచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గంజాయి తరలించే వాహనానికి ముందుగా ఓ ఎస్కార్ట్ వాహనంతో వెళ్లి చెక్ పోస్టుల వద్ధ పరిస్థితిని అంచనా వేస్తారు. ముందు పోలీసుల తనిఖీలు ఉంటే వెంటనే ఎస్కార్ట్ వాహనంలోని వారు గంజాయి డీసీఎం డ్రైవర్ కు సమాచారం అందించి అప్రమత్తం చేస్తారు. ఇలా పుష్ప సినిమా తరహాలో అక్రమ గంజాయిని కొనసాగిస్తున్నారని..తనిఖీల్లో అనుమానంతో డీసీఎంను పూర్తిగా చెక్ చేయడంతో అక్రమం గంజాయి రవాణ వ్యవహారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు.