ట్రైనీ ఎస్సైపై ఎస్సై అత్యాచారయత్నం

విధాత:ఒక సామాన్య దళిత మహిళ కాస్తోకూస్తో చదువుకోవడమే చాలా కష్టం. అలాంటిది చదువు పూర్తి చేసుకుని ఎస్సైగా కూడా ఎంపికైంది ఆమె. కఠినమైన శిక్షణను సైతం పూర్తి చేసుకుంది. అయినా, ప్రొబెషనరీ సమయంలో ఎస్సై రూపంలో పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన దళిత యువతి 2020లో ఎస్సైగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కేటాయించారు. ఇటీవల ఆమెను మరిపెడ పీఎ్‌సలో ప్రొబెషనరీ ఎస్సైగా నియమించారు. అవివాహిత అయిన ఆమె పోలీసు […]

ట్రైనీ ఎస్సైపై ఎస్సై అత్యాచారయత్నం

విధాత:ఒక సామాన్య దళిత మహిళ కాస్తోకూస్తో చదువుకోవడమే చాలా కష్టం. అలాంటిది చదువు పూర్తి చేసుకుని ఎస్సైగా కూడా ఎంపికైంది ఆమె. కఠినమైన శిక్షణను సైతం పూర్తి చేసుకుంది. అయినా, ప్రొబెషనరీ సమయంలో ఎస్సై రూపంలో పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన దళిత యువతి 2020లో ఎస్సైగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కేటాయించారు. ఇటీవల ఆమెను మరిపెడ పీఎ్‌సలో ప్రొబెషనరీ ఎస్సైగా నియమించారు. అవివాహిత అయిన ఆమె పోలీసు స్టేషన్‌ సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి వద్ద శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 11.38 గంటలకు ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి ట్రైనీ మహిళా ఎస్సైకి ఫోన్‌ చేసి, ‘నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది.

మనం వెంటనే తనిఖీలు చేయాలి. నాతో పాటు రావాలి’అని హుకుం జారీ చేశాడు. ఆ తర్వాత ఆమెను ప్రైవేట్‌ వెహికిల్‌లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో వాహనం నిలిపివేసి, ట్రైనీ మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా తన పశుబలంతో అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో ఆమె ముఖం, ఇతర శరీరభాగాలపై గాయాలయ్యా యి. విషయాన్ని బయటకు చెబితే పైఅధికారులకు తప్పుడు రిపోర్టు రాసి, సస్పెం డ్‌ చేయిస్తానని బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఆమె తెల్లవారి కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సూచన మేరకు మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని, లేదంటే ఎస్‌ఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ అధికారులను రంగంలోకి దింపి కూపీ లాగారు.