కొవిడ్‌తో వైద్యురాలి మృతి

విధాత,నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మత్తు విభాగాధిపతి డాక్టర్‌ నిర్మలాదేవి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. పదిహేను రోజుల క్రితం ఈమె మహమ్మారి బారినపడ్డారు. స్థానిక ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మంగళవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా, వైద్య కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. నిర్మలాదేవి మృతిపై జీజీహెచ్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

  • Publish Date - June 17, 2021 / 09:18 AM IST

విధాత,నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మత్తు విభాగాధిపతి డాక్టర్‌ నిర్మలాదేవి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. పదిహేను రోజుల క్రితం ఈమె మహమ్మారి బారినపడ్డారు. స్థానిక ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.

మంగళవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా, వైద్య కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. నిర్మలాదేవి మృతిపై జీజీహెచ్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Latest News