Salt | సాయంత్రం 6 త‌ర్వాత ఉప్పు కొంటున్నారా..? అయితే ల‌క్ష్మీ క‌టాక్షం త‌గ్గిపోతుంద‌ట‌..!

Salt | చాలా మంది సాయంత్రం వేళ వంటింటి స‌రుకులు తెచ్చుకోవ‌డానికి మార్కెట్‌కు వెళ్తుంటారు. వంటింట్లోకి కావాల్సిన కూర‌గాయ‌లు( Vegetables ), ఇత‌ర సామాగ్రిని కొని తెచ్చుకుంటున్నారు. కానీ కొన్ని వ‌స్తువుల‌ను కొన‌కూడ‌ద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు.

Salt | సాయంత్రం 6 త‌ర్వాత ఉప్పు కొంటున్నారా..? అయితే ల‌క్ష్మీ క‌టాక్షం త‌గ్గిపోతుంద‌ట‌..!

Salt | గృహిణులు సాయంత్రం వేళ‌.. మార్కెట్‌కు వెళ్తారు. మ‌రుస‌టి రోజుకు కావాల్సిన కూర‌గాయలు( Vegetables ) కొనుగోలు చేస్తారు. ఇక ప‌ప్పులు, నూనెలు( Oils ), ఉప్పు( Salt ), కారం, పసుపుతో పాటు ఇత‌ర వ‌స్తువులు కూడా కొంటుంటారు. కానీ వంటింట్లో ప్ర‌ధాన‌మైన ఉప్పు( Salt )ను మాత్రం సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత కొన‌కూడ‌ద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉప్పు ఒక్క‌టే కాదు.. మ‌రికొన్ని వ‌స్తువులు కూడా కొనుగోలు చేయ‌కూడ‌ద‌ట‌. ఒక వేళ సాయంత్రం 6 త‌ర్వాత ఉప్పు కొంటే.. దుర‌దృష్టం వెంటాడుత‌ద‌ట‌. ల‌క్ష్మీ క‌టాక్షం కూడా త‌గ్గిపోతుంద‌ట‌. ఉప్పుతో పాటు ఏయే వ‌స్తువు కొనుగోలు చేయ‌కూడ‌దో తెలుసుకుందాం..

ఉప్పుతో పాటు వీటిని కొనుగోలు చేయ‌కూడ‌దు..

  • ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదని హెచ్చరిస్తున్నారు. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం 6 దాటిన తర్వాత కొనుగోలు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోతుందని చెబుతున్నారు.
  • అలాగే నువ్వులు, నువ్వుల నూనె కూడా సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శని దోషం చుట్టుకుని.. అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయని వివరిస్తున్నారు.
  • ఆముదం గింజలు, ఆముదనూనె కొంటే శని ద్వారా అనేక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు.
  • ఇనుముకు సంబంధించిన ఎలాంటి వస్తువులు సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని చెబుతున్నారు. గొడ్డలి, కత్తులు, గడ్డ పార, గునపం, పలుగు లాంటి వస్తువులు కొనవద్దని సూచిస్తున్నారు.
  • కొందరు ఆడవారు సాయంత్రం సమయంలో షాపింగ్​లకు వెళ్తుంటారు. అప్పుడు పిన్నీసులు, సూదులు కొనకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్ర దేవత చుట్టుకుంటుందని తెలిపారు.