Vastu Tips | పడక గదిలో ఈ రంగు దుప్పట్లను ఉపయోగిస్తున్నారా..? లక్ష్మీ దేవి కటాక్షం తగ్గిపోతుందట..!!
Vastu Tips | పడక గది( Bed Room )లో ఉపయోగించే దుప్పట్ల( Blanket )విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు దుప్పట్ల( White Blanket )ను ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు. కొన్ని రంగుల దుప్పట్లు వినియోగించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ దేవి( Lakshmi Devi ) కటాక్షం తగ్గిపోతుందట.
Vastu Tips | ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. కానీ కొన్నిసార్లు కలిసిరాదు. సంపాదించిన ధనం( Money ) అంతా నీళ్ల మాదిరి ఖర్చు అవుతుంటుంది. అలా కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే మన పడక గది( Bed Room ) ఉండే మంచం( Cot ), దానిపై వేసే దుప్పట్ల( Blanket ) విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. లక్ష్మీ దేవి( Lakshmi Devi ) అనుగ్రహం లభించి, సంపాదన రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా బెడ్( Bed ) మీద ఉపయోగించే దుప్పట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం సరిగ్గా ప్రధాన ద్వారానికి ఎదురుగా లేకుండా చూసుకోవాలి. అలాగే.. బాత్ రూమ్( Bath Room ) ఎదురుగా మంచం ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా వస్తే మామూలు సమయాల్లో ఎప్పుడూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ నియమం తప్పకుండా పాటించాలి.
పడక గది( Bed Room )లో బెడ్ మీద ఉపయోగించే దుప్పట్లు నలుపు( Black ), నీలం( Blue ) రంగులో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉంటే.. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ దేవి కటాక్షం తగ్గిపోతుందట. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు దుప్పట్లు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
పడక గది సీలింగ్‌కి బ్లూ కలర్( Blue Color )లో ఉండకూడదట. ఇలా ఉంటే.. భార్యాభర్తల( Couples ) మధ్య గొడవలు తలెత్తే ఛాన్స్ ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైనా సరే పడకగదిలో నారింజ( Orange ), పసుపు( Yellow ), ఎరుపు( Red ) రంగు వంటివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందని చెబుతున్నారు.
అలాగే.. మంచం మీద ఉపయోగించే దుప్పట్లపై త్రిభుజాకారం లేదా ఏదైనా కోణం ఆకారంలో గుర్తులు ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్న కూడా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు. కొందరు మంచం కింద పనికిరాని వస్తువులు ఉంచుతుంటారు. అంటే.. బొమ్మలు, పాత సూట్‌కేసులు, పాత సామానులు వంటివి పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులు మంచం కింద ఉన్న కూడా లక్ష్మిదేవి అనుగ్రహం తగ్గిపోతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ నియమాలు పాటించాలని పండితులు కోరుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram