Nagula Chavithi | పుట్టలో పాలు పోసేటప్పుడు చెప్పాల్సిన మంత్రం ఎంటో తెలుసా? నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం ఎంటంటే!

Nagula Chavithi | నాగులకు పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసం( Karthika Masam )లో శుక్ల పక్షం తిథి రోజున నాగుల చవితి( Nagula Chavithi ) వస్తుంది. ఈ పర్వదినాన నాగులను పూజించడం, వాటికి పాలు పోయడం ద్వారా సర్ప భయాలను తొలగించుకోవచ్చు. అలాగే, సంతాన సిద్ధితో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

  • By: raj |    devotional |    Published on : Oct 25, 2025 7:30 AM IST
Nagula Chavithi | పుట్టలో పాలు పోసేటప్పుడు చెప్పాల్సిన మంత్రం ఎంటో తెలుసా? నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం ఎంటంటే!

Nagula Chavithi |  విధాత : నాగులకు పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసం( Karthika Masam )లో శుక్ల పక్షం తిథి రోజున నాగుల చవితి( Nagula Chavithi ) వస్తుంది. ఈ పర్వదినాన నాగులను పూజించడం, వాటికి పాలు పోయడం ద్వారా సర్ప భయాలను తొలగించుకోవచ్చు. అలాగే, సంతాన సిద్ధితో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలాంటి నాగచవితికి హిందూ పండుగల్లో ప్రత్యేకమైన విశిష్టతే ఉంది.

సర్ప దోష నివారణ

రాణాల ప్రకారం మన పూర్వ జన్మ పాపాలు లేదా కుండలినీ శక్తి జాగృతం చేయాలనుకునే వారికి సర్ప దోష నివారణ పూజగా భావిస్తారు. నాగుల చవితి రోజున నాగులను పూజించడం ద్వారా కుండలినీ శక్తి స్థిరంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. జ్యోతిష్యానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. దీనికి పరిహారంగా సర్పదోష నివారణ చేస్తారని విశ్వాసం

సంతాన భాగ్యం

సంతానం కలగని దంపతులు నాగుల చవితి రోజున నాగ దేవతలను పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారని భక్తులు నమ్ముతారు.

పంటలకు రక్షణ

పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతను ఆరాధిస్తారు. దీని వల్ల పంటలు క్షేమంగా ఉండి భూమికి సారాన్ని కలిగించాలని ప్రార్థిస్తారు. ఇది పంటల పెరుగుదలకు పశువులు, పక్షులకు రక్షణగా ఉంటుందని నమ్మకం.

ఆరోగ్యం, సుఖశాంతులు

నాగుల ప్రభావం నుంచి బయటపడేందుకు, భయాలు తొలగించుకునేందుకు భక్తులు సర్పదేవతలను పూజిస్తారు. ఈ పూజల ద్వారా సర్పదోషం, వ్యాధి దోషాల తొలగడంతో పాటు సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు.

కార్తీక మాసంలో నాగ దేవతలను ఆరాధించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రతీతి.. కార్తీక మాసానికి అగ్ని దేవతగా ఉంటుంది. మన జీవనానికి కావాల్సిన ఉత్తేజం, ఉత్సాహం, తేజస్సు వంటి సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, ఈశ్వరుడికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వల్ల హరిహరులను సేవించిన ఫలం దక్కుతుందని విశ్వాసం.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం ఎంటంటే!

పాలు స్వచ్ఛతకు ప్రతీకంగా ఉంటుంది. పాల ద్వారా వచ్చే అనేక పదార్థాలను హిందూ పూజా విధానాల్లో అనేక రకాలుగా వాడుతారు. పంచామృతంలో ముఖ్యంగా పెరుగు, నెయ్యి కలుపుతారు. ఇవి పాల పదార్థాలే. నెయ్యిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తారు. అలాగే మన బతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే మజ్జిగ కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే మజ్జిగ లభిస్తుంది. ఈ మజ్జిగను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

“దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి, పిల్లల చేత చెప్పించాలి:

‘నడుము తొక్కితే నావాడు అనుకో.. పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో. తోక తొక్కితే తోటి వాడు అనుకో. నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ’ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పించడంలో ప్రధాన ఉద్దేశం. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు.. దీనికి కారణం మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని ఇలా చేస్తారని భక్తులు నమ్ముతారు.