రేపే హ‌నుమాన్ జ‌యంతి.. ఆంజ‌నేయుడిని ఏ స‌మ‌యంలో ఆరాధించాలో తెలుసా..?

ప్ర‌తి ఏడాది చైత్ర మాసంలో పౌర్ణ‌మి రోజున హ‌నుమాన్ జ‌యంతిని జ‌రుపుకుంటాము. ఇక హ‌నుమంతుడిని పూజించేందుకు భ‌క్తులు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే రేపు ఏ స‌మ‌యంలో ఆంజ‌నేయుడిని ఆరాధించాలో తెలుసుకుందాం..

  • Publish Date - April 22, 2024 / 07:14 PM IST

ప్ర‌తి ఏడాది చైత్ర మాసంలో పౌర్ణ‌మి రోజున హ‌నుమాన్ జ‌యంతిని జ‌రుపుకుంటాము. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హ‌నుమాన్ ఆల‌యాల‌న్నీ ముస్తాబ‌వుతున్నాయి. విద్యుదీపాల‌తో ఆల‌యాలు మెరిసిపోతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో హ‌నుమాన్ శోభాయాత్ర నిర్వ‌హించేందుకు కూడా భ‌క్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక హ‌నుమంతుడిని పూజించేందుకు భ‌క్తులు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే రేపు ఏ స‌మ‌యంలో ఆంజ‌నేయుడిని ఆరాధించాలో తెలుసుకుందాం..

ఆ స‌మ‌యంలో పూజిస్తే మంచిది..!

చైత్ర మాసంలో శుక్ల‌ప‌క్ష పౌర్ణ‌మి.. ఏప్రిల్ 23న తెల్ల‌వారుజామున 3.45 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. ఏప్రిల్ 24న అంటే బుధ‌వారం ఉద‌యం 5.18 గంట‌ల‌కు ముగుస్తుంది. ఇక హ‌నుమాన్‌ను ఆరాధించేందుకు అనువైన స‌మ‌యం 23న ఉద‌యం 9.03 గంట‌ల నుంచి ఉద‌యం 10.41 గంట‌ల వ‌ర‌కు పూజించొచ్చు. బ్రహ్మ ముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 4.20 నుంచి 5.04 గంటల వరకు ఉంది. అభిజీత్ ముహూర్తం ఉదయం 11.53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.46 గంటలకు ముగుస్తుంది.

ఈ ఏడాది ప్ర‌త్యేక‌త ఇదే..!

అయితే ఈ ఏడాది హ‌నుమంతుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన మంగ‌ళ‌వారం నాడే హ‌నుమాన్ జ‌యంతి వ‌చ్చింది. కాబ‌ట్టి హ‌నుమాన్ భ‌క్తులు త‌ప్ప‌కుండా ఆంజ‌నేయుడి ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేస్తే అన్ని శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలను హనుమంతుడికి, రాముడికి చేసుకోవడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని సూచించారు.

నైవేద్యంగా ఇవి స‌మ‌ర్పించాలి..!

హ‌నుమాన్ జ‌యంతి రోజున ఆంజ‌నేయుడిని పూజించ‌డం వ‌ల్ల క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఆంజ‌నేయ స్వామికి ప‌చ్చిమిర్చి, బెల్లం, నూనె, బేస‌న్ ల‌డ్డూ నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తే చాలా మంచిది. విశేష ఫ‌లితాలు కూడా వ‌స్తాయి. హ‌నుమన్ జ‌యంతి రోజున రామాయ‌ణం చదువుకోవ‌డం శుభ‌ప్ర‌దం. ముఖ్యంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం జపిస్తే చాలా మంచిది.
రోగభయం, భూతప్రేతాల వల్ల కలిగే భయాలను హనుమంతుడు తొలగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Latest News