12.08.2024 సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా శుభ ఫలితాలు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తారు. ఉద్యోగస్తులకు ఈ రోజు గొప్ప శుభఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభతో, శక్తిసామర్ద్యాలతో అందరి దృష్టి ఆకర్షిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఊహించని లాభాలను అందుకుంటారు.
వృషభం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఉద్యోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. సన్నిహితులతో వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మిథునం
అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే పనులు సకాలంలో పూర్తవుతాయి. మనోబలం కోల్పోకుండా కృషి చేస్తే విజయం సాధించవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కర్కాటకం
ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి నిపుణులు తమ వృత్తిజీవితంలో కీలక ఘట్టానికి చేరుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. మీ పోటీదారులపై విజయాలను సాధిస్తారు. నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.
సింహం
పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. పనిలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల మూలంగా అధిక ధనవ్యయం ఉంటుంది. కొందరి ప్రవర్తన మనస్తాపన కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలు, ఘర్షణలు పెట్టుకోవద్దు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తుల
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారు లక్ష్య సాధన కోసం కృషి చేసి గమ్యాన్ని చేరుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. బంధువర్గంలో కొందరి ప్రవర్తన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి.
వృశ్చికం
విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. దృఢ సంకల్పంతో, సాహసోపేతమైన నిర్ణయాలతో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. విలాసాల కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. దుష్టులకు దూరంగా ఉంటే మంచిది. లేకుంటే మీరు కూడా తప్పు దోవ పట్టే ప్రమాదముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులకు అవసరానికి ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి నిపుణులు తమ పనితీరుకు మంచి ప్రశంసలు అందుకుంటారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విజయాలను అందుకుంటారు. వ్యాపారులు సమాజంలో పేరున్న వ్యక్తుల సహకారంతో పెద్ద ప్రాజెక్టులను దక్కించుకుంటారు. సంపద పెరుగుతుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. నూతన వస్తువాహనాలు కొంటారు. వ్యాపారులు పోటీ దారులతో తగాదా పడవద్దు. సహనం వహిస్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు ఎదురవుతాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతికూల ఆలోచనలు దరి చేరనీయకండి. బంధువుల వైఖరి కారణంగా అశాంతిగా ఉంటారు. దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది.