Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి గణనీయంగా పెరగనున్న ఆదాయం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అవకాశాలుగా మలచుకుని ముందుకు వెళ్లగలితే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం కొనసాగుతోంది. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు కొనుగోళ్లు అమ్మకాల ద్వారా మంచి లాభాలు గడిస్తారు. మీ పరోపకార పనులతో జనాదరణ పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఓర్పు, నేర్పుతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు చాలా అదృష్టమైన రోజు. స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ప్రయాణం చేయడంలో మీకున్న ఆసక్తి కారణంగా కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులతో విహారయాత్రకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చక్కని ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా అద్భుతమైన రోజు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మానసిక సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వ్యాపారంలో శుభయోగాలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో ప్రశాంతంగా ఉంటారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రతికూల పరిస్థితులను జయిస్తారు. వృత్తిపరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృథా ఖర్చులు నివారించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక శుభ సంఘటనలు జరుగుతాయి. స్ఫూర్తిదాయక పుస్తకాల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలోకి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రేమాదరణలు ఆనందం కలిగిస్తాయి. మీ నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా వృత్తి పరమైన వ్యవహారాలపై శ్రద్ధ లోపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లబ్ది ఉండవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. వైద్యపరమైన ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు భయపడకుండా ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో ఆచి తూచి నడుచుకోవాలి. ధార్మిక , సామాజిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు అశాంతి కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదమైన రోజు. ఆర్థికంగా లాభించవచ్చు. స్నేహితుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనోధైర్యంతో ఉండడం అవసరం. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. పొదుపు ప్రణాళికలు చేపడితే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram