Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జలగండం..! జర జాగ్రత్త..!!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారులు మునుపెన్నడూ చూడని లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఆనందం కలిగిస్తాయి. అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన పురోగతి ఉంటుంది. కొందరు వ్యక్తులు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు. అందుకే వాయిదా వేయండి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆర్థికంగా గొప్ప యోగం ఉంటుంది. అనేక మార్గాల నుంచి ధనప్రవాహం ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ స్థిరత్వంపై దృష్టి సారించాలి. వ్యాపారంలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కొత్త ప్రయత్నాలకు దూరంగా ఉంటే మంచిది. మాతృ వర్గంతో కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. జలగండం సూచన ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉంటే మంచిది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ప్రతిష్ఠను దెబ్బతీసే పనులేవి చేపట్టకండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. ఆర్థికంగా గడ్డు సమయం.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మీ మొండి వైఖరి మీతోబాటు మిగతా వారినీ కష్టాల పాలు చేస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులు నియంత్రించండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనేక సవాళ్లు ఉండవచ్చు. అధికారులతో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు ఒక వ్యవహారంలో ఆర్థిక నష్టం సంభవించవచ్చు. కుటుంబ సమస్యలు అశాంతి కలిగిస్తాయి. పెద్దల మాటలు గౌరవించడం మంచిది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. స్నేహితులద్వారా ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఖర్చులు నియంత్రించండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున తలపెట్టిన పనులన్నీ స్వల్ప ప్రయత్నంతోనే సులభంగా పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారులకు, వృత్తినిపుణులకు ఒక పెద్ద శుభవార్త ఎదురుచూస్తోంది. పొత్తులు, భాగస్వామ్యాలు అదృష్టకరంగా పరిణమిస్తాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. రోజువారీ పనుల నుంచి కొంత విశ్రాంతి తీసుకుని వినోదంగా గడుపుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది. డబ్బుకు లోటుండదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram