నేటి రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కోరుకున్న వ్యక్తితో పెళ్లి..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభసమయం నడుస్తోంది. వృత్తి వ్యాపారాలలో తిరుగులేని ప్రగతిని సాధిస్తారు. ఉద్యోగులు నూతన టెక్నాలజీతో పనిచేసి శభాష్ అనిపించుకుంటారు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం వరించి ధనవంతులు అవుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథునం
ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే పట్టుదలతో, చిత్తశుద్ధితో పనిచేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం కూడదు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజు చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వ పడే స్థాయికి ఎదుగుతారు.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్ధికంగా ఓ మెట్టు పైకి ఎక్కుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు. మనోబలంతో, ధైర్యంతో ఉంటే సమస్యలను అధిగమించవచ్చు.
తుల
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగు వేయాలి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరినీ నమ్మకుండా ఉంటే మంచిది. కోపం అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితులతో మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధిపత్య ధోరణితో వ్యవహరించే వారి విషయంలో సహనంతో ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా నిరాశ నిస్పృహలతోనే గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నంలో తీవ్రమైన శ్రమకు గురవుతారు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదముంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులు సృజనాత్మకతతో, దృఢ నిశ్చయంతో పనిచేసి విజయాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి.