Zodiac Signs | నేడు మీన రాశిలోకి చంద్రుడు..! ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..!!
Zodiac Signs | ఇవాళ వసంత పంచమి(Vasant Panchami ). ఈ రోజున చంద్రుడు( Moon ) తన రాశి చక్రాన్ని మార్చి.. కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 23న ఉదయం 8.34 గంటలకు చంద్రుడు మీన రాశి( Pisces )లోకి ప్రవేశించనున్నారు. ఈ మార్పు కారణంగా ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. మరి ఆ మూడు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఈ సంచారం వల్ల ఆయా రాశులపై ప్రభావం పడనుంది. మరి ముఖ్యంగా వసంతి పంచమి( Vasant Panchami ) రోజున కుంభ రాశి నుంచి మీన రాశి( Pisces )లోకి చంద్రుడు సంచారం చేయనున్నాడు. జనవరి 23న ఉదయం 8.34 గంటలకు చంద్రుడు( Moon ) మీన రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ సంచారం ఒక్క రాశిపైనే కాకుండా అన్ని రాశుల( Zodiac Signs )పై ప్రభావం చూపించనుంది. మరి ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అనుకూలత చూపించనుంది. ఈ మూడు రాశుల వారికి ఊహించని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. డబ్బు పరంగా అపారమైన వృద్ధిని అనుభవించే అవకాశం ఉంది. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం (Taurus)
వసంతి పంచమి రోజున మీన రాశిలోకి చంద్రుడు ప్రవేశించడం మూలంగా.. వృషభ రాశి వారికి అన్ని విధాలా శుభప్రదం. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మరి ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులు వరించే అవకాశం ఉంది. జీవితంలో కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించబడుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఇది మంచి కాలమే. 5వ ఇంట్లో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి.. విద్య విషయంలో విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు సరస్వతీ దేవీ ఆశీస్సులతో అన్ని పరీక్షలతో ఉత్తీర్ణత పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రయత్నించే విద్యార్థులు సఫలీకృతులవుతారు. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అయితే, అవి మీకు విజయాన్ని తెస్తాయి. జీవితంలో శాంతి, ఆనందం పెరుగుతాయి.
ధనస్సు (Sagittarius)
చంద్రుడు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదం. దీని వల్ల ధనస్సు రాశి వారికి అనేక మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వారు తమ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. పాత పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు ఉంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram