28.05.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి నీటిగండం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 28, 2024 / 06:13 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

వృషభం

వృషభ రాశి వారికీ ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్థులు రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఉద్వేగానికి లోనవుతారు. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టే వారి పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తే మంచిది. ఆటంకాలు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల క్షేమం పట్ల ఆందోళన కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్థులు నష్టాలను చవి చూస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. గృహంలో అశాంతి నెలకొంటుంది. నీటి గండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్థులకు పనిభారం పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆస్తి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే ప్రతి పనిలోనూ విజయసిద్ధి ఉంది. లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుంది. ఇంట్లో శుభకార్యాల మూలంగా ధనవ్యయం ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలు, వివాదాలు ఏర్పడతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్దాన చలనం ఉండవచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాల్లో గడుపుతారు. ఉద్యోగస్థులు, వ్యాపారస్థులకు అనుకూలం. ఆశించిన ప్రయోజనాలు దక్కుతాయి. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవల కారణంగా అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఇంటా బయటా తీరికలేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగస్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్థులకు వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉండదు.

Latest News