Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచన..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృషభం
దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
మిధునం
నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
కర్కాటకం
సమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఋణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.
సింహం
వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సోదరులతో స్ధిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సంతాన పరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి.
కన్య
చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గానీ పూర్తికావు. బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
తుల
జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమౌతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి నుండి బయటపడతారు.
వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం
ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
కుంభం
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.
మీనం
ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగమున అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram