ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, ఆర్ధిక పరమైన లాభాలు మెండుగా ఉంటాయి.మాతృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.

వృషభం

ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మీ ఆశయాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అశుభకరమైన ఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఈ రోజు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలలో కూడా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తమ తమ రంగాల్లో ప్రతిభావంతంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తిపరంగా, ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేసే పనిలో పురోగతి ఉండదు. వృత్తి, వ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు నెలకొంటాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మేలు. ఆరోగ్యం సహకరించదు. వృత్తిపరమైన సమస్యల కారణంగా ఆందోళనకు గురి కావడంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. సింహరాశి వారికి సహజంగా ఉండే గాంభీరం, ధైర్యం కారణంగా అన్ని ఆపదల నుంచి గట్టెక్కుతారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్ధులకు కఠినంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో సవాళ్లు, ఆర్ధిక నష్టాలు ఉండవచ్చు. అనవసర చర్చలు, వాదనల్లో పాల్గొనకుండా ఉంటే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. మీ కోపం కారణంగా చేతికి అందిన అవకాశాలు కూడా దూరమవుతాయి. వృత్తిపరమైన సమస్యలతో ఆందోళనగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కలహాల కారణంగా నలుగురిలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది.

వృశ్చికం

ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వ్యాపారాలలో మెరుగైన పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. స్థిరాస్తి రంగం వారికి కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి శుభసమయం నడుస్తోంది. కుటుంబంలో ఆస్తికి సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడంలో విఫలం చెందుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. అన్ని పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో, ఆందోళనతో ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలం ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉంటాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ రోజు అద్భుతాలు చేస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సంపాదన పెరగడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. అనుకోకుండా గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వృత్తిపరంగా హోదా పెరుగుతుంది.