Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ పెద్దలతో గౌరవంగా మెలగాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఆర్ధిక క్రమశిక్షణతో ఖర్చులు అదుపులో ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఒక సంఘటన ఉత్సాహాన్నిస్తుంది. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. వివాదరహితంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఇంటా బయట మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు ఇది అనుకూలమైన రోజు కాదు. నష్ట భయం ఉంది కాబట్టి ఆచి తూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ధన యోగాలున్నాయి. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచన ఉంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ప్రజాదరణ, పరపతి పెరుగుతాయి. పరోపకార కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు, గౌరవం పొందుతారు. మీ సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో మనస్పర్థలకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కీలక నిర్ణయాల విషయంలో స్ఫష్టమైన విధానంతో ముందుకు సాగాలి. ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. దైవానుగ్రహంతో ఎంతటి కష్టమైనా పనినైనా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సామాజికంగా మీ పరపతి పెరుగుతుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి. సహనం పాటించి, ఓర్పుతో ఉంటే మేలు జరుగుతుంది. వివాదాలకు, ఘర్షణలు దూరంగా ఉండడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు కలవర పెడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram