Horoscope | మంగళవారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తిపరంగా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. స్నేహితులు, బందువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఖర్చులు అధికమయ్యే అవకాశముంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. నూతన ప్రాజెక్టులు, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి, ఆదాయం వృద్ది వంటి శుభ ఫలితాలు ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంది. వృత్తినిపుణులకు, ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరగడంతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా, విచక్షణతో వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోండి. ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరగడంతో ఈ రోజంతా ఆహ్లదంగా గడుపుతారు. రచయితలకు సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తారాబలం వ్యతిరేకంగా ఉన్నందున ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆచి తూచి అడుగేయండి. కొత్త పనులు, ప్రయాణాలు చేపట్టవద్దు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. ధననష్టం సంభవించే సూచనలున్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.