Telangana | పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్
Telangana | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు.
Telangana | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. వీరిద్దరూ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవన్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తికాగా, తీర్పు రిజర్వులో ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో విచారణ దృష్ట్యా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందే తీర్పు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram