Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఆర్థిక న‌ష్టం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Feb 21, 2026 7:03 AM IST
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఆర్థిక న‌ష్టం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. మానసిక ఆనందం కలిగించే శుభవార్తలు వింటారు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా బలమైన యోగం ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. ముఖ్యమైన పనుల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆచి తూచి నడుచుకోవాలి. వృత్తి పరమైన సవాళ్లు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆర్థిక వ్యవహారాలు తెలివిగా నిర్వహించాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం అండగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి పరంగా నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అనువైన సమయం. మానసిక సంతృప్తి కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ధార్మిక, పవిత్రకార్యాలలో నిమగ్నం అవుతారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కాలం అనుకూలిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రంగాల్లో శుభవార్తలు వింటారు. మీ పరోపకార కార్యక్రమాలతో సమాజంలో ప్రజాదరణ, అధికారం, గౌరవం పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పెరగడం అసహనం కలిగిస్తుంది. క్రమశిక్షణ, సమయపాలనతో ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాల కోసం గట్టిగా కృషి చేయాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు దూసుకెళ్తారు. కుటుంబ పరమైన వేడుకలు, ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో మీ మనోధైర్యం అందరికీ ఆదర్శమవుతుంది. మీ కీర్తి, గౌరవం పెరుగుతాయి. ఆర్థికంగా సమయోచిత నిర్ణయాలు లాభాన్నిస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఊహించని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. వృత్తి పరమైన సమస్యలతో విచారంగా ఉంటారు. ఆర్థిక నష్టం కలగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలతో కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ముందస్తు ప్రణాళికతో ఆటంకాలు అధిగమిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతారవరణం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమయపాలన, ముందస్తు ప్రణాళికలు విజయాన్ని అందిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థికంగా మేలైన సమయం. ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల ప్రశంసలు ప్రోత్సాహాన్నిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు.