31.07.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన్ని వైపులా ధ‌న ప్ర‌వాహం..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

31.07.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన్ని వైపులా ధ‌న ప్ర‌వాహం..!

మేషం

పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు. వృత్తివ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులు, సహచరులతో సత్సంబంధాలు కలిగిఉంటే మంచిది.

వృషభం

ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. నూతనోత్సాహాంతో పనిచేసి అద్భుతాలను సాధిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయంగా కూడా ఈ రోజు మంచి రోజు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది.

మిథునం

వృత్తి వ్యాపారాల్లో రాణించాలంటే సమయానుకూలంగా నడుచుకోవాలి. కోపం అదుపులో పెట్టుకోకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితులతో, అనవసరమైన వివాదాలు ఏర్పడే అవకాశముంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలతో సతమతమవుతారు. వృధా ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు కోరుకున్న వారితో వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది.

సింహం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలు సాధిస్తారు. అదృష్టం వరించి ప్రమోషన్ పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య

వృత్తి వ్యాపారాల్లో విజయం ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్థులు సందర్భానుసారం నడుచుకుంటే అంతా అనుకూలంగా ఉంటుంది. ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో సన్నిహిత సంబంధీకుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ముందు అందరితో పరుషంగా వ్యవహరించి, సమస్యలు వచ్చాక బాధపడినా ప్రయోజనం ఉండదు. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. ఆర్ధిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం

వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి, ఆర్ధిక అభివృద్ధి ఉంటాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్థులకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. గొప్ప ప్రతిభతో సమస్యలను అధిగమిస్తారు. దైవబలంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.

మకరం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. ప్రత్యర్థుల వైఖరి ఓ కంట కనిపెడుతూ ఉండటం అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

కుంభం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు మీ పక్కనే ఉంటారు. వ్యూహాత్మకంగా వ్యహరించాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోవద్దు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించి అందరి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది.