Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి భూ, గృహ, వాహన యోగాలున్నాయి..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. ఆటంకాలు అధిగమించి ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. పని ప్రదేశంలో అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు విడిచి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే మంచిది. ఆర్థిక పరిస్థితి కొంచెం కఠినంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. మనసుకు సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. స్వయంకృషితో లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులవుతారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ నిర్ణయాలు అందరికీ ఆదర్శం అవుతాయి. మీ కృషికి అదృష్టం కూడా తోడవడంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బుద్ధి చతురతతో వ్యవహరించి మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొందరి ప్రవర్తన మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయవచ్చు. ఓర్పు, సహనంతో ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విశేషమైన ఆర్థిక లాభాలు, విజయాలు చేకూరుతాయి. లక్ష్మి కటాక్షంతో సిరి సంపదలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సవాళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారంలో ధన నష్టం సంభవించవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉంటుంది. సన్నిహితులతో మనస్పర్థలు అశాంతి కలిగిస్తాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. లాభాలు, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో మీ సమర్ధతకు గుర్తింపు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram