Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ధన, స్వర్ణ, వస్త్ర లాభాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు. బుద్ధిబలంతో వృత్తి పరమైన ఆటంకాలు అధిగమిస్తారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ పరోపకార కార్యక్రమాలతో సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు ఉంటాయి. అధికారుల ప్రశంసలు మీలో నూతనోత్సాహాన్ని నింపుతాయి. మీ సమర్థతను అధికారులు విశ్వసించి పదోన్నతులతో ప్రోత్సహిస్తారు. ఆత్మవిశ్వాసంతో కృషిచేసి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొనే సమర్థత పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి మొదలవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో చేసే ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో కీలక బాధ్యతలు ఆనందంగా స్వీకరిస్తారు. ఆత్మస్థైర్యంతో చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారంలో విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితం సంతృప్తి కలిగిస్తుంది. సహచరుల సహకారం, అధికారుల ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తుంది. ఒక సంఘటన మీ మనోబలాన్ని పెంచుతుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు. మానసిక ఉల్లాసం కలిగించే వార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల సూచనలకు అనుగుణంగా నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ మనోబలంతో ముందడుగు వేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటిస్తే బంధాలు బలపడతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభసమయం ప్రారంభమైంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్పష్టమైన విధానంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. లక్ష్మీకటాక్షంతో సంపద, సుఖజీవనం సిద్ధిస్తాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కాలం కొంత ప్రతికూలంగా ఉన్నందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి సహనంతో ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో ఏమరుపాటుతో నష్టం వాటిల్లవచ్చు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ధన, స్వర్ణ, వస్త్ర లాభాలు ఆనందం కలిగిస్తాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైన స్థిరచిత్తంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక నిర్ణయాల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవచ్చు.

Latest News