House Cleaning | ఇల్లు ఏ దిశ‌లో ఊడ్చాలో తెలుసా సుమా..?

House Cleaning | ప్ర‌తి ఇల్లాలు కూడా త‌మ ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌రిశుభ్ర‌త కోసం ఇంటిని పొద్దుకు నాలుగైదు సార్లు ఊడ్చుతుంటారు. అంతేకాకుండా.. ఒక నిర్దిష్ట‌మైన దిక్కు నుంచి కాకుండా.. ఏ దిశ నుంచంటే ఆ దిశ నుంచి ఇల్లు ఊడ్చ‌డం చేస్తుంటారు.

House Cleaning | ప్ర‌తి ఇల్లాలు కూడా త‌మ ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌రిశుభ్ర‌త కోసం ఇంటిని పొద్దుకు నాలుగైదు సార్లు ఊడ్చుతుంటారు. అంతేకాకుండా.. ఒక నిర్దిష్ట‌మైన దిక్కు నుంచి కాకుండా.. ఏ దిశ నుంచంటే ఆ దిశ నుంచి ఇల్లు ఊడ్చ‌డం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాద‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఇల్లు ఊడ్చేందుకు కూడా వాస్తు నియ‌మాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇల్లు ఊడ్చ‌డం నుంచి మొద‌లు పెడితే.. ముగింపు వ‌ర‌కు వాస్తు నియ‌మాలు పాటించాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఆ వాస్తు నియ‌మాలు ఏంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఊడ్చ‌డం ఏ దిశ నుంచి ప్రారంభించాలి..?

చాలా మంది ఏ దిశ నుంచంటే ఆ దిశ నుంచి ఇల్లు ఊడ్చ‌డం చేస్తుంటారు. ఇలా చేయ‌డం మంచిది కాద‌ట‌. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈశాన్య మూల నుంచి ఇల్లు ఊడ్చ‌డం ప్రారంభిస్తే మంచిద‌ట‌.

ఏ దిశ‌గా ఊడ్చుతూ వెళ్లాలి..?

ఈశాన్య మూల నుంచి ప్రారంభించి ఆగ్నేయం, వాయువ్యం మీదుగా ఇల్లును ఊడ్చి.. చెత్త‌ను సేక‌రించాలి.

ఏ దిశ‌గా ముగించాలి..?

ఇక ఇల్లు ఊడ్చిన త‌ర్వాత.. చివ‌ర‌గా నైరుతి దిశ‌లో ఊడ్చ‌డం పూర్తి చేసి.. ఆ త‌ర్వాత చెత్త‌ను బుట్ట‌లో వేయాలి.

ఇల్లు ఏ దిశ‌లో ఉన్న ఈశాన్యం నుంచే ప్రారంభించాలా..?

మీ ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉన్నా సరే.. ఈశాన్యం నుండి ప్రారంభించి నైరుతిలో ముగించడమే అత్యంత శుభప్రదం.

సూర్యోద‌యానికి ముందు ఇల్లు ఊడ్చొచ్చా..?

చాలా మంది గృహిణులు త‌మ ఇంటిని సూర్యోద‌యం తర్వాత చీపురుతో ఊడ్చుతుంటారు. ఇది మంచిది కాద‌ట‌. ఉద‌యం నిద్ర లేవ‌గానే, సూర్యోద‌యానికి ముందే ఇల్లును ఊడ్చితే.. ఆ ఇంట్లోకి ల‌క్ష్మీదేవి ఆహ్వానించ‌బ‌డుతుంద‌ట‌. దీంతో ఆ ఇంట సిరిపంప‌ద‌లు క‌లుగుతాయ‌ట‌.

సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇల్లు ఊడ్చోచ్చా..?

సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభంగా పరిగణించబడుతుంది. సాయంత్రం వేళ మహాలక్ష్మి ఇంటికి వచ్చే సమయం కాబట్టి, ఆ సమయంలో చీపురు పడితే దరిద్రం చుట్టుముడుతుందని పెద్దలు చెబుతారు.

Latest News