Venkateshwara Swamy Puja | అప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఏడు శ‌నివారాలు ఏడు కొండ‌ల స్వామిని ఇలా పూజించండి..!

Venkateshwara Swamy Puja | అప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఏడు శ‌నివారాల పాటు ఏడు కొండ‌ల స్వామిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే కొండంత కష్టాన్ని కూడా క్ష‌ణాల్లో తొల‌గించేస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. కాబ‌ట్టి చాలా మంది ఏడు శ‌నివారాల పాటు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి వ్ర‌త పూజా చేస్తుంటారు.

Venkateshwara Swamy Puja | అప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఏడు శ‌నివారాలు ఏడు కొండ‌ల స్వామిని ఇలా పూజించండి..!

Venkateshwara Swamy Puja | అప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఏడు శ‌నివారాల పాటు ఏడు కొండ‌ల స్వామిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే కొండంత కష్టాన్ని కూడా క్ష‌ణాల్లో తొల‌గించేస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. కాబ‌ట్టి చాలా మంది ఏడు శ‌నివారాల పాటు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి వ్ర‌త పూజా చేస్తుంటారు. ఈ పూజ‌ను స్త్రీ, పురుషులు ఎవ‌రైనా చేయొచ్చు. స్త్రీల‌కు రుతుస్రావం జ‌రిగితే.. ఆ వారం వ‌దిలేసి మ‌రో వారం త‌మ వ్ర‌త పూజ‌ను కొన‌సాగించొచ్చు. కానీ పురుషులు ఒక‌సారి వ్ర‌తాన్ని మొద‌లుపెడితే అంత‌రాయం లేకుండా ఏడు వారాల పాటు త‌ప్ప‌కుండా చేయాల్సిందే. మ‌రి ఆ వ్ర‌త పూజా విధానం ఏంటో తెలుసుకుందాం.

వ్ర‌త పూజా విధానం ఇదే..

-వ్ర‌త పూజా చేయాల‌నుకునే వారు శ‌నివారం వేకువ‌జామునే నిద్ర మేల్కొనాలి. అభ్యంగ‌న స్నానం ఆచ‌రించాలి. అనంత‌రం పూజా మందిరాన్ని ప‌రిశుభ్రం చేసుకోవాలి. వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌టం కానీ, విగ్ర‌హం కానీ పూల‌తో అలంక‌రించాలి. ఇక మ‌న‌సులో ఈ రోజు నుంచి ఏడు శ‌నివారాల పాటు వ్ర‌తం చేస్తున్నాన‌ని స్వామి వారికి చెప్పుకోవాలి.

-వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి.

-ఇక పూజ‌లో భాగంగా.. పిండి దీపం వెలిగించాలి. ఇందు కోసం శుక్ర‌వారం రాత్రే ఒక గ్లాస్ బియ్యాన్ని నీటిలో నాన‌బెట్టాలి. శ‌నివారం పూజ ప్రారంభించే స‌మ‌యానికి ఆ బియ్యాన్ని వ‌డ‌క‌ట్టి.. పిండి త‌యారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి.

-అనంత‌రం పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి, ఆవు నేతితో వేంకటేశ్వరస్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవింద నామాలు చదువుకోవాలి. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి, శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి, నీరాజనాలు ఇవ్వాలి.

-ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి, అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు, అప్పుల బాధలు పోతాయని పండితులు చెబుతున్నారు.

వ్ర‌త పూజా చేసే స‌మ‌యంలో ఈ నియ‌మాలు పాటించాల్సిందే..!

వ్ర‌త పూజ‌లో పాల్గొనే వారు శ‌నివారం రోజు నూనె ఉప‌యోగించ‌ని ఆహారాన్ని మాత్ర‌మే తీసుకోవాలి. పూర్తిగా నెయ్యితో త‌యారు చేసిన ఆహార ప‌దార్థాల‌ను తింటే మంచిది. మ‌ధ్యాహ్నం మాత్ర‌మే భోజ‌నం చేయాలి. మ‌ద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటించాలి.