Peacock Feather | నెమలి ఈకలు ఇంట్లో ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Peacock Feather | నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆ నెమలి ఈకలను తాకాలనిపిస్తుంది. ఇక నెమలి ఈకలు కనిపిస్తే చాలు.. వాటిని తీసుకువచ్చి పుస్తకాల్లో దాచుకునేవారు చాలా మందే ఉంటారు. ఇల్లు అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఇంట్లో కూడా నెమలి ఈకలు పెడుతుంటారు. ఈ ఈకలు అలంకరణకే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చనున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలకు సంపద, సమృద్ధిని కలిగించే లక్ష్మీదేవితో బలమైన సంబంధం ఉంది. కాబట్టి నెమలి ఈకలను ఇంట్లోనే దాచుకున్న, లేదా వ్యాపారం చేసే దగ్గర ఉంచిన ఆర్థికంగా మెరుగుడపుతామని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఇక నెమలి ఈకలను బెడ్రూమ్‌లో ఉంచితే భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుందని పండితుల విశ్వాసం. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరిగి కలహాలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
నెమలి ఈకలు ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడమే కాకుండా నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయట. అవి ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాలను తిప్పికొట్టే సామర్థాన్ని కలిగి ఉంటాయట. కాబట్టి, మీ ఇల్లు లేదా కార్యాలయంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.
ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు, వీటిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలను తొలగించుకోవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇందుకోసం ఎనిమిది పొడవాటి నెమలి ఈకలను తెల్లటి దారంతో కట్టి ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. అయితే, వాటిని కట్టేటప్పుడు “ఓం సోమయ్ నమః” అని జపించాలట. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇవేకాకుండా.. నెమలి ఈకను ఇంట్లో ఉంచడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram