women | ప్రతి రోజు ఏదో రకంగా ఎవరితో ఒకరితో పరిచయాలు( Introduction ) ఏర్పడుతూనే ఉంటాయి. ఆ పరిచయాల్లో కొన్ని జీవితాంతం( Life Long ) కొనసాగే అవకాశం ఉంటుంది. మరికొన్ని మధ్యలోనే ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిచయాలు కొన్ని మంచిని, మరికొన్ని చెడును కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కానీ శుక్రవారం( Friday ) వారితో పరిచయాలు ఏర్పరుచుకుంటే ఎంతో మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మరి ముఖ్యంగా శుక్రవారం( Friday ) మహిళలతో( Women ) ఏర్పడే పరిచయం.. బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జీవితాంతం ఆ పరిచయం కొనసాగుతోందని, ఆపదలో అండగా నిలిచే విధంగా ఉంటాయని పేర్కొంటున్నారు. భార్యభర్తల( Couples ) మధ్య నెలకొన్న విభేధాలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలకూ శుక్రవారం బాగా కలిసివస్తుందని పండితులు సూచిస్తున్నారు.
అలాగే సినీ, టీవీ, మీడియా( Media ) రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేవారు.. శుక్రవారం ప్రయత్నిస్తే కచ్చితంగా విజయవంతం అవుతారట. వీరు భవిష్యత్‌లో గొప్ప నటులు( Actors ), యాంకర్లు( Anchors )గా మారే అవకాశం ఉంటుందట. పట్టిందల్లా బంగారమే అన్నట్లు వీరి భవిష్యత్ ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక శుక్రవారం రోజు ఆడవారు జుట్టు విరబూసుకుని ఎడవకూడదని.. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం రోజు శుక్ర హోరు ఉన్న సమయంలో లక్ష్మీ దేవి( Lakshmi Devi )కి సంబంధించిన ఏ నామం చదివినా సరే.. లక్షీ కటాక్షం విశేషంగా కలుగుతుందని అంటున్నారు. ప్రధానంగా శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, సెంటు, ఉసిరిక పవ్వు నీటిలో కలిపి 5 నిమిషాల తర్వాత వాటితో స్నానం చేస్తే దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం త్వరగా పొందొచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.