Zodiac Signs | ఈ నాలుగు రాశుల పురుషులు.. భార్య‌ల వ‌ల్ల కోటీశ్వరులై పోతార‌ట‌..!

Zodiac Signs | ప్ర‌తి ఒక్క‌రికి కోటీశ్వ‌రులు( Millionaires ) కావాల‌నే కోరిక ఉంటుంది. కానీ అది అంద‌రికీ సాధ్యం కాదు. అయితే ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) పురుషులు( Men ) మాత్రం త‌మ భార్య‌ల( Wives ) వ‌ల్ల కోటీశ్వ‌రులైపోతార‌ట‌. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 04, 2025 7:00 AM IST
Zodiac Signs | ఈ నాలుగు రాశుల పురుషులు.. భార్య‌ల వ‌ల్ల కోటీశ్వరులై పోతార‌ట‌..!

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మొత్తం 12 రాశులు, 9 గ్ర‌హాలు ఉన్నాయి. ఈ రాశులు, గ్ర‌హాల గ‌మ‌నం కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రి జాత‌క ఫ‌లాలు( Horoscope ) ఒక్కో ర‌కంగా ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో గ్ర‌హాల గ‌మ‌నం కార‌ణంగా కొన్ని రాశుల‌ పురుషుల‌కు( Men ) అదృష్టం క‌లిసి వ‌స్తుంది. ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) పురుషుల‌కు మాత్రం పెళ్లాయ్య‌క వారి భార్య‌ల( Wives ) ద్వారా ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ట‌. భార్య‌ల వ‌ల్ల కోటీశ్వ‌రులైపోతార‌ట‌( Millionaires ). మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

వృషభ రాశి ( Taurus )

వృష‌భ రాశి పురుషులు విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ వీరి వ‌ద్ద డ‌బ్బు అధికంగా ఉందు. కానీ ఈ రాశి పురుషుల‌కు త‌మ భార్య‌ల ద్వారా అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ట‌. ధ‌న‌వంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటార‌ట‌. దాంతో వివాహం అనంత‌రం ఈ రాశి పురుషులు కోటీశ్వ‌రులైపోతార‌ట‌.

సింహ రాశి ( Leo )

సింహ రాశికి చెందిన పురుషులు కూడా రాజ‌సంగా బ‌త‌కాల‌ని కోరుకుంటారు. కానీ వీరికి కూడా సాధ్యం కాదు. కానీ పెళ్లైన త‌ర్వాత ల‌క్కు వ‌రిస్తుంద‌ట‌. వివాహం అనంత‌రం భార్య వ‌ల్ల ధ‌న‌వంతులుగా మారి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతార‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోయి.. సంతోషంగా జీవిస్తార‌ట‌. మొత్తానికి ఈ రాశి పురుషుల‌కు కూడా భార్య‌నే అదృష్ట‌వంతురాల‌ట‌.

తుల రాశి  ( Libra )

తుల రాశి వారికి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు , ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, వీరికి వీరి భాగస్వామి వచ్చిన తర్వాత అదృష్టం కలుగుతుంది. ధనవంతురాలైన భార్య రావడం వలన వీరి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు కొదవే ఉండదు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది.

మకర రాశి ( Capricorn )

మకర రాశి వారికి వివాహం తర్వాత ఒక్కసారిగా అదృష్టం అనేది మారిపోతుంది. వీరికి ఊహించ‌ని విధంగా డబ్బు చేతికందుతుంది. అంకిత భావంతో పని చేస్తారు. ఇంటిలో ప్రశాంత వాతావరణం ఏర్ప‌డుతుంది. ఈ రాశి వారు తమ భార్య వలన లక్షాధికారులు అవుతారు. డబ్బుకు కొదవే ఉండదు.