రేపే ఉగాది పండుగ‌.. ఏ స‌మ‌యంలో పూజిస్తే మంచిదో తెలుసా..?

తెలుగు క్యాలెండ‌ర్ ప్ర‌కారం క్రోధి నామ సంవ‌త్స‌రం ఏప్రిల్ 9వ తేదీతో ప్రారంభం అవుతుంది. తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ‌ను గొప్ప‌గా జ‌రుపుకుంటారు. పంచాంగ శ్ర‌వ‌ణం జ్యోతిష్య పండితులు చెబుతారు. అయితే ఉగాది నాడు ఏ స‌మ‌యంలో దేవుడికి పూజించాలి..? అస‌లు ఆ రోజున ఏయే కార్య‌క్ర‌మాలు చేయాలో తెలుసుకుందాం..

రేపే ఉగాది పండుగ‌.. ఏ స‌మ‌యంలో పూజిస్తే మంచిదో తెలుసా..?

తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ‌ను గొప్ప‌గా జ‌రుపుకుంటారు. పంచాంగ శ్ర‌వ‌ణం జ్యోతిష్య పండితులు చెబుతారు. అయితే ఉగాది నాడు ఏ స‌మ‌యంలో దేవుడికి పూజించాలి..?

తెలుగు క్యాలెండ‌ర్ ప్ర‌కారం క్రోధి నామ సంవ‌త్స‌రం ఏప్రిల్ 9వ తేదీతో ప్రారంభం అవుతుంది. తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ‌ను గొప్ప‌గా జ‌రుపుకుంటారు. పంచాంగ శ్ర‌వ‌ణం జ్యోతిష్య పండితులు చెబుతారు. అయితే ఉగాది నాడు ఏ స‌మ‌యంలో దేవుడికి పూజించాలి..? అస‌లు ఆ రోజున ఏయే కార్య‌క్ర‌మాలు చేయాలో తెలుసుకుందాం..

ఇక ఉగాది రోజున ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంటిని ప‌రిశుభ్రం చేసుకుంటారు. తెల్ల‌వారుజామునే కుటుంబ స‌భ్యులంతా స్నానాలు చేసుకుని, భ‌క్తి లోకంలో మునిగిపోతారు. ఇంటి ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డుతారు. పూల‌తో పూజ గ‌దిని అలంక‌రించుకుటారు. కొత్త బ‌ట్ట‌లు వేసుకుని, పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తారు. మ‌రో వైపు ఉగాది రోజున భ‌క్షాలు త‌యారు చేసి దేవుళ్లకు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తుంటారు.

అయితే ఉగాది రోజున 3 నుంచి 5 గంట‌ల మ‌ధ్య తైల అభ్యంగ‌న స్నానం చేయాల‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 5 గంట‌ల నుంచి 7:45 నిమిషాలు లోగా షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడి సేవించాలి. ఉదయం 7:15 నిమిషాలకు రేవతి నక్షత్ర మేష లగ్నమున, ఉదయం 11:34 నిమిషాలకు అశ్వని నక్షత్ర మిథున లగ్నమున చిట్ట, ఆవర్జాలకు, కొత్త పుస్తకాలు, బెల్లం, పంచదార, పసుపు, బంగారం, వెండి రత్నములు క్రయవిక్రయాలు వ్యాపారం చేయవచ్చు. ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తు సామగ్రి, సరుకులు బోణీ వేయుటకు క్రయవిక్రయాలు చేయవచ్చు.