Sun’s Transit in Taurus | వృష‌భ రాశిలో సూర్యుడి సంచారం.. జూన్ 15 వ‌ర‌కు ఈ మూడు రాశుల వారికి ముప్పుతిప్ప‌లే..!

Sun's Transit in Taurus | గ్ర‌హాల సంచారంలో భాగంగా మే 15వ తేదీన సూర్యుడు వృష‌భ రాశి( Taurus )లోకి ప్ర‌వేశించాడు. సూర్య భ‌గ‌వానుడు( Sun ) జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఇదే రాశిలో సంచారం చేయ‌నున్నాడు. అయితే జూన్ రెండో వారం వ‌ర‌కు అధిక మాసం కావ‌డంతో.. సూర్య సంచారం స‌మ‌యంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

Sun’s Transit in Taurus | గ్ర‌హాల సంచారంలో భాగంగా మే 15వ తేదీన సూర్యుడు వృష‌భ రాశి( Taurus )లోకి ప్ర‌వేశించాడు. సూర్య భ‌గ‌వానుడు( Sun ) జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఇదే రాశిలో సంచారం చేయ‌నున్నాడు. అయితే జూన్ రెండో వారం వ‌ర‌కు అధిక మాసం కావ‌డంతో.. సూర్య సంచారం స‌మ‌యంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ముప్పుతిప్ప‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఆ మూడు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

మిథున రాశి ( Gemini )

సూర్యుడు వృష‌భ రాశిలో సంచారం కార‌ణంగా మిథున రాశి వారికి స‌వాలే. ఎందుకంటే ప్ర‌ధానంగా ఈ రాశి వారికి త‌మ ప్ర‌త్య‌ర్థులు అడుగ‌డుగునా ఆటంకం క‌ల్పించే ప్ర‌మాదం ఉంది. మ‌రింత చురుకుగా మారి ఇబ్బందులు సృష్టించే అవ‌కాశం ఉంది. ఇది సామాజిక ప్ర‌తిష్ఠ‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో ఎవ‌ర్నీ కూడా గుడ్డిగా న‌మ్మొద్దు. ఈ నెల రోజులు మాన‌సికంగా బ‌లంగా మారాల్సిన స‌మ‌యం ఇది.

కన్యా రాశి ( Virgo )

క‌న్యారాశి వారు కూడా ఆర్థిక విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. దూకుడుత‌నం అస‌లే ప‌నికిరాదు. తోబుట్టువుల‌తో వివాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ఒడిదుడుకుల కార‌ణంగా.. రుణాలు చేసే అవ‌కాశం ఉంది. స్థాయికి మించి అప్పులు చేయ‌క‌పోవ‌డం ఉత్త‌మం.

తులా రాశి ( Libra )

తులా రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సూర్యుని ప్రభావం వల్ల చర్మ వ్యాధులు, పైత్యరస సంబంధిత రుగ్మతలు లేదా శారీరక బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక రంగంలో కూడా హెచ్చుతగ్గులు కొనసాగుతాయి. ఆర్థిక నష్టాలను నివారించడానికి, పెట్టుబడుల విషయంలో ఎలాంటి పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి.

ఈ గ్రహ సంచారం సమయంలో ఓర్పు, సంయమనం పాటించడమే విజయానికి కీలకం. సూర్యుడు క్రమశిక్షణకు ప్రతీక, కాబట్టి ఈ మూడు రాశుల కింద జన్మించిన వారు తమ దినచర్య, ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి. జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులోని అడ్డంకుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

Latest News