Taurus Astrology | వృషభ రాశివారికి ఏడాదంతా అనుకూల ఫలితాలే..! పట్టిందల్లా బంగారమే..!!
Taurus Astrology | వృషభరాశి( Taurus ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.

Taurus Astrology | వృషభరాశి( Taurus ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. 15 మే 2025 వరకు జీవితంలో మంచి యోగవంతమైన కాలం ఏర్పరచును. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, జీవన విధానంలో ఉన్నతి పొందడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విద్యార్దులకు అతి చక్కటి విజయాలు ప్రాప్తించును. శరీర దారుడ్యత, ఆరోగ్యం కోసం ఆలోచించడం మొదలు పెడతారు. చెడు వ్యసనాల నుండి బయట పడతారు. గ్రంధ రచన చేయాలనే సంకల్పం కలిగిన వారికి ఈ కాలం అనుకూలమైనది.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు సంతాన లాభములు పొందుటకు అనుకూలమైన కాలం. వివాహ ప్రయత్నాలకు కూడా గురు గ్రహ బలం తోడగును. కుటుంబ సంబంధ సంతోష సమయాలు, బందు వర్గ కూడికలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ముఖ్యంగా 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు సోదర సోదరి వర్గం వారి వలన బాగా లాభపడతారు. వారి వలన యోగవంతమైన జీవనం అనుభవిస్తారు. భాత్రు వర్గంతో ఏర్పడి ఉన్న సమస్యలు అన్నీ సమసిపోతాయి. తగవులందు రాజీ ప్రయత్నాలకు ఈ కాలం అత్యంత అనుకూలమైనది.
6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఆశించిన విధంగా ధన సంపదలను నిలువ చేసుకోగలరు. గృహ లేదా భూ సంపదలను ఏర్పరచుకోవడానికి అనువైన కాలం. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గురు గ్రహం వృషభ రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ప్రసాదించును.
వృషభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రాంత చలనం లేదా పర దేశములందు పౌరసత్వం కొరకు ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. లోహములు, నల్లని రంగు వస్తువుల సంబంధ వ్యాపారాలు, వ్యవసాయం చేయు వారికి ఈ సంవత్సరం అతి చక్కటి లాభములు కలుగ చేయును. విహార యాత్రలు చేయదలచిన వారి మనోవాంచ నెరవేరును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారు శని గ్రహం వలన అనేక విధముల లాభపడతారు.
వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా అతి చక్కటి లాభములు ఏర్పడతాయి. 18 మే 2025 వరకు సులువైన ధనార్జన కలుగ చేయును. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆర్ధికంగా, హోదా పరంగా లాభములు ఏర్పరచును. నూతన వాహన సౌఖ్యం ప్రసాదించును. 19 మే 2025 నుండి ఉద్యోగ జీవనంలో కోరుకున్న మార్పులు ప్రసాదించును. ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొనునట్లు చేయును. ఆర్ధికంగా యోగించును. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారు రాహు గ్రహం వలన పూర్తిగా అనుకూల ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన లాభ వ్యయాలు సమానంగా ఎదురగును. వ్యక్తిగత జాతకంలో కేతు గ్రహ బలం పూర్తిగా లోపించి సంతాన ప్రయత్నములు చేయు వారు నిరాశాజనక ఫలితాలు పొందుతారు. మిగిలిన అన్ని విషయాలలో కేతువు వృషభ రాశి వారికి సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ప్రసాదించును.