Horoscope Prediction | జ్యోతిష్యశాస్త్రంలో పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల్లో మూడు రాశులకు మాత్రం అత్యంత ప్రత్యేకత ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిగతా రాశుల వారు చూడలేనివి.. ఈ మూడు రాశుల వారు చూడగలరు. ఈ మూడు రాశుల్లో జన్మించిన వారికి అతీంద్రయ శక్తులు ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఈ మూడు రాశుల వారికి దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయట. వారు స్వయంగా ఆత్మలతో మాట్లాడుతారట. దీనికి కారణం.. వారి బర్త్ చార్ట్‌లో ఎనిమిదవ, పన్నెండవ గ్రహాలకు సంబంధం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
మిథున రాశి( Gemini )
మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. దీన్ని సమాచార గ్రహంగా కూడా పేర్కొంటారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది. అపరిచితులు, దెయ్యాలు గ్రహాంతర వాసుల నుంచి రహస్యాలను వినడానికి ఈ రాశివారు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారట. వీరు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నపుడు కూడా వీరు స్పష్టమైన కలలను కంటు ఉంటారట. వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై కూడా మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారట.
వృశ్చిక రాశి ( Scorpio )
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తలు ఎల్లప్పుడూ శృంగారం, మరణం, రహస్యాలు, నిగూఢ క్రీడలు, పునర్జమ్మ వంటి అంశాలకు సంబంధించిన వాటిపై ఆసక్తి చూపుతారట. ఈ రాశి వారికి స్వచ్చమైన జలశక్తి ఉంటుందట. ఇది అంతర్ దృష్టిని కలిగిస్తుంది. వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం కరెక్టు అవుతుందట. వీరు లోకాన్ని ఈజీగా చదివేస్తారట. వృశ్చిక రాశి వారు అతీంద్రీయ శక్తుల పట్ల బాగా ఆకర్షితులవుతారని.. వీరిని ఎవరూ అంత ఈజీగా మోసం చేయ్యలేరని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీన రాశి (Pisces )
మీనరాశిలో పుట్టిన వ్యక్తులను వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుందట. ఇది సంకేతాలు, దృశ్యాలు, భ్రమలు, మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం. వీరు అపరిచితులు, తేలియాడు ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారట. ఈ రాశివారు ఆత్మల్ని చూడగలరు. వాటితో మాట్లాడగలరు. అతీంద్రీయ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు. అయితే వీరు జీవితాన్ని ఒకేవైపు కాకుండా రెండు వైపులా చూడగలరట. ఓ వైపు అతీంద్రీయ అంశాల్ని పరిశీలిస్తూనే మరోవైపు సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఈ రాశి వారు కచ్చితంగా సరిహద్దును విభజించుకోగలరని పండితులు సూచిస్తున్నారు.