Ugadi Rasi Phalau 2025 | కన్యా రాశి జాతకం ఎలా ఉండబోతుందంటే..? ఆ మూడు నెలల్లో ఆర్థిక లాభాలే లాభాలు..!
Ugadi Rasi Phalau 2025 | కన్యా రాశి( Virgo ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి.

Ugadi Rasi Phalau 2025 | కన్యా రాశి( Virgo ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మిక్కిలి లాభ పడతారు.
15 మే 2025 వరకు పితృ వర్గీయుల వలన అధికంగా లాభపడతారు. పితృ వర్గ సహకారం వలన మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టగలుగుతారు. వారసత్వ తగాదాలు అన్ని పరిష్కారం అవుతాయి. స్వార్జిత నిలువ ధనం కూడా పెరుగుతుంది.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు వైవాహిక విషయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. జీవిత భాగస్వామి వర్గీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో పుణ్య క్రతువులు నిర్వహించబడతాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురు గ్రహం వలన ఆర్ధికంగా అధిక లాభాలను పొందుతారు. వ్యక్తిగత జాతకంలో గజ కేసరి యోగం ఉన్న వారికి విశేష భాగ్య సంపదలు లభిస్తాయి.
6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు కూడా గురు గ్రహం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ పేరు ప్రతిష్టలు పెంచగలుగుతారు. కనిష్ట భాత్రు వర్గం వారి పట్ల మీ భాద్యత పెరుగుతుంది. వారి ముఖ్య అవసరాలకు సహాయ పడగలుగుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలకు ఇది చక్కటి కాలం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న హస్తా నక్షత్రంలో జన్మించిన వారు శతబిషా నక్షత్రంలో జన్మించిన వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సరం అంతా గురు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోను సూచనలు అధికంగా ఉన్నాయి. శని గ్రహ ప్రతికూల ప్రభావం వలన సంతానం కూడా మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. బాగా ఎదిగిన సంతాన విద్యాసంబంధ విషయాల్లో మీ నిర్ణయాలు ఇబ్బందులను కలుగచేస్తాయి. న్యాయస్థాన తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. నూతన శత్రుత్వాల వలన ఇబ్బందులు ఎదురగును. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు తరచుగా తేలికపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. జీవిత భాగస్వామి సహకారం ఆశించిన విధంగా ఉండదు. వివాహ ప్రయత్నాలు చివరి నిమిషంలో నిరాశ పరచును. 19 మే 2025 నుండి స్థిరాస్థి సంబంధ విషయాల్లో అనుకూలత లభిస్తుంది. వారసత్వ సంపద పరంగా లాభ పడతారు. సొంత గృహ సంబంధ విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. 18 మే 2025 వరకు అదృష్ట హీనత బాదించును. రాహు గ్రహం వలనే కేతువు కూడా ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలుగచేయును. ఈ సంవత్సరం అంతా కన్యా రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. 19 మే 2025 నుండి కేతు గ్రహం వలన ధన వ్యయం అదుపు తప్పుతుంది. పారమార్ధిక చింతన అధికం అవుతుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు మరియు రాహు గ్రహం వలన మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని గ్రహం వలన మరియు కేతు గ్రహం వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ మరియు కేతు గ్రహ దోషాలు కలిగి ఉన్న జాతకులు గ్రహ శాంతులు జరుపుట మంచిది.