మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొత్త ప్రయత్నాలు, పెట్టుబడులు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో ఉద్రిక్తపూరిత వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వివాదాలకు దారి తీయవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీతో మెలగడం ముఖ్యం. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం స్థిరమైన ప్రగతి గోచరిస్తోంది. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారులకు ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యూహాత్మక నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. నూతన గృహ యోగం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో నిర్లక్ష్యం తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా తాత్కాలికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. భవిష్యత్తుకు భద్రత ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి సారించడం మంచిది. ప్రేమ వ్యహారాలు బెడిసికొట్టే ప్రమాదముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం శ్రమించక తప్పదు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగంలో పని ప్రదేశంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో శుభ ఫలితాలు, ధనలాభాలు ఉంటాయి. ఏకాగ్రత, శ్రద్ధతో పని చేయడం వల్ల లాభాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సహకారం మెండుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉంటుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ప్రేమ సంబంధాలు వర్ధిల్లుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులకు, ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి ఇది అద్భుతమైన వారం.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు అందించే ప్రోత్సాహంతో అనేక విజయాలు సాధిస్తారు. మీ మాటకు విలువ, గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో కొంత నష్ట భయం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అధిగమించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉండవచ్చు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. పనిప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అధికారుల సహకారం ఉత్సాహాన్నిస్తుంది. ఈ వారం వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు. మీ కీర్తి వ్యాపిస్తుంది. ఆర్థికంగా ఈ వారం సంపన్నంగా ఉంటుంది. బహుళ వనరుల నుంచి ఆదాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో వివాదాలు రాకుండా చూసుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం చేటు చేస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రతతో పనిచేస్తే ఉన్నత స్థానం లభిస్తుంది. వ్యాపారులు ఈ వారం ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. లాభాలు తగ్గినా వ్యాపారం పెరగడం ఆనందం కలిగిస్తుంది.ఆర్థికంగా, వారం ప్రారంభంలో ఆదాయం బలంగా ఉంటుంది కానీ తరువాత కొంత క్షీణించవచ్చు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో చేసే ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు వృత్తిపరమైన పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కీలక సమస్యను విజయవంతంగా పరిష్కరించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తి వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది, ఆదాయంలో వేగవంతమైన పెరుగుదల సాధ్యమవుతుంది. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. ప్రేమ వ్యహారాల్లో ఆనందం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. స్థానచలనం ఉంటుంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఆర్థికంగా ప్రస్తుత కాలం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల వల్ల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తత, ఘర్షణలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెలిగితే మంచిది. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు శ్రద్ధగా పని చేయడం వల్ల అధికారుల మన్ననలు పొందుతారు. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కీలకమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం తమ తమ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. స్వయంకృషితో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. వ్యాపారులకు అనువైన సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పథకాల ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రేమవ్యవహారాలు కుటుంబ మద్దతుతో పురోగతి సాధిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతుతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ వారం వ్యాపారులు తమ వ్యాపారంలో గొప్ప పురోగతిని చూస్తారు. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక నిల్వలు పెరగడంతో మెరుగైన జీవన ప్రమాణాన్ని సాధిస్తారు. విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
