మేషం
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిపట్ల అంకితభావం అవసరం. మీ పని తీరుతో అందరినీ మెప్పించగలిగితే ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనాలు లేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఆశించిన ఆర్ధిక ప్రయోజనాలు అందుకోడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వారం ద్వితీయార్ధంలో ఉద్యోగులు సమష్టి కృషితో మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి వారం ప్రథమార్ధంలో ప్రతికూలతలు ఉండవచ్చు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులు కెరీర్ లో స్థిరత్వం కోసం శ్రమించాలి.
మిథునం
మిథున రాశి వారికి ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కీలక వ్యక్తి నుంచి వృత్తి పరంగా సహాయం అందుకుంటారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఇదివరకు మీ మధ్య ఉన్న అపార్ధాలు కూడా తొలగిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనువైన సమయం నడుస్తోంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు అనుకోకుండా ముందుకు సాగుతాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఇది మీ ఆదాయాలను పదిరెట్లు పెంచుతుంది. విజయం తెచ్చిన ఆనందంతో ఉత్సాహం ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారి కల నిజమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యాపారాలు క్రయ, విక్రయాలలో లాభాలు గడిస్తారు. విదేశాలలో కెరీర్ కొనసాగించాలని అనుకునే వారు, వ్యాపారం స్థాపించాలని ప్రయత్నించే వారు సవాళ్లను ఎదుర్కొంటారు.
సింహం
సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. ఉద్యోగులపై అకస్మాత్తుగా పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాధ్యతలు, కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు కఠిన శ్రమతో మాత్రమే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. కొన్ని ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కన్య
కన్య రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి వారం చివరలో మంచి ఆఫర్ రావచ్చు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారస్తులు పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని వృద్ధి చేసి విజయం సాధిస్తారు.
తుల
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ ఆస్తికి సంబంధించి భేదాభిప్రాయాల కారణంగా మీరు తరచుగా కోర్టును సందర్శించవచ్చు. వారం ప్రారంభంలో తోబుట్టువుతో విభేదాల కారణంగా మానసిక క్షోభను అనుభవించవచ్చు. కుటుంబంలో దురదృష్టకర పరిణామాలను నివారించడానికి మాటలు జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. వృత్తి పరంగా ఎదురయ్యే చికాకులను పట్టించుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉండవు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్, వ్యాపారం అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి. ప్రియమైన వారి నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. ఉద్యోగులు మీ పురోగతిని అడ్డుకునే ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి. వారం ప్రారంభంలో అన్ని రంగాలవారికి వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి పట్ల మీరు చూపే అంకిత భావానికి ప్రశంసలు అందుకుంటారు. ఇన్ని రోజుల మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. వారం చివరలో జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వెచ్చిస్తే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్ధిక లాభాలను పొందవచ్చు. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా వహించాలి.
మకరం
మకరరాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ఒక సవాలుగా ఉంటుంది. వృత్తి పరంగా ఆటంకాలు, వ్యక్తిగతంగా బరువైన బాధ్యతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే అదనపు కృషి అవసరం. పెరిగిన ఖర్చులను మీ ఆర్ధిక పరిస్థితిని దిగజారుస్తాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం పొందడానికి నిరీక్షణ తప్పదు. జీవిత భాగస్వామితో విభేదాల విషయంలో వివాదాలకు పోకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం. కుటుంబ సభ్యుల అనారోగ్యం, అపార్ధాలు చికాకు కలిగిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం బద్దకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. భూ వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవడం ఉత్తమం. కోర్టు కేసులు తరచూ వాయిదా వేస్తే నష్టపోయే ప్రమాదముంది. వ్యాపారులకు ఈ వారం అనుకూలం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. నష్టాలను నివారించడానికి లాభదాయకమైన వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే మంచిది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం.
మీనం
మీనరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉంటే అన్ని రంగాల్లో విజయం మీ వెంటే ఉంటుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారవేత్తలకు వారం ప్రారంభంలో పురోగతి నిదానంగా ఉన్నా, వారం చివరకు ఊహించని లాభాలను అందుకుంటారు. సంపదలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కుటుంబ సంబంధాలలో సున్నితంగా వ్యవహరించడం అవసరం.