Akshaya Tritiya | నేడే అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు శుభసమయం ఇదే..!
Akshaya Tritiya | వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ తిథిని అక్షయ తృతీయ( Akshaya Tritiya )గా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పవిత్ర కార్యాలు, దానాలు, పూజలు, హోమాలు లాంటివి నిర్వహిస్తే శాశ్వతమైన ఫలితాలు ఇస్తుంటాయని పండితులు చెప్తుంటారు. బంగారం( Gold ) కొనుగోళ్లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతుంటారు.

Akshaya Tritiya | వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ తిథిని అక్షయ తృతీయ( Akshaya Tritiya )గా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పవిత్ర కార్యాలు, దానాలు, పూజలు, హోమాలు లాంటివి నిర్వహిస్తే శాశ్వతమైన ఫలితాలు ఇస్తుంటాయని పండితులు చెప్తుంటారు. బంగారం( Gold ) కొనుగోళ్లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంతోపాటు.. శాశ్వతమైన సంపద చేకూరుతుందని భావిస్తారు. అందుకే.. ఈ శుభ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ.. ఈ సారి.. అక్షయ తృతీయకు.. రోహిణి నక్షత్రం కూడా కలిసి రావడాన్ని మరింత పవిత్ర దినంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సారి బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.
బంగారం కొనుగోళ్లకు శుభసూచకంగా భావించే అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ తిథి ప్రారంభమైంది. వివిధ రకాల శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ తిథి బుధవారం తెల్లవారుజామున 5:32 నిమిషాలకు మొదలైంది. ఈ తిథి మధ్యాహ్నం 2:15 నిమిషాల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం 5.32 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనొచ్చు.
ఇదిలావుంటే.. గోల్డ్ కొనుగోళ్లకు కేరాఫ్ అయిన అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరగడం షాకిస్తోంది. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. మళ్లీ పరుగులు పెడుతోంది. వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం రేటు.. స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 490 పెరగడంతో పది గ్రాముల గోల్డ్ రేటు రూ. 98,900లకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 450 పెరిగి.. రూ. 91,580 లకు చేరింది. ఇక.. అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత తగ్గుతుందని భావించిన కొనుగోలుదారులకు పసిడి ధర పెరుగుదలతో నిరాశ ఎదురవుతోంది.