చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనేక రకాల ఆందోళన, ఒత్తిళ్లు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆందోళన చెందవద్దు. అన్నీ సర్దుకుంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన పని ఒత్తిడితో అలిసిపోతారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో చేసిన పొదుపు నిల్వలు తరిగిపోకుండా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే మేలు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభఘడియలు వచ్చేసాయి. సంపద వృద్ధి చెందుతుంది.జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
తుల
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కలిసివచ్చే కాలం. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి శుభసమయం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసికంగా, శారీరకంగా అలిసి పోయారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ పిల్లల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఊహించని సంఘటనలు, ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆర్ధికంగా నష్టపోతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తివ్యాపారాల వారు తలపెట్టిన ప్రతి పనిలో రాణిస్తారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఇంట్లో శుభకార్యాలు, పూజలు వంటివి జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది.