LIC HFL Notification | ప్రముఖ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ(కనీసం 55 శాతం మార్కులు) పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 కంటే ముందు, 2005 ఏప్రిల్ 1 తర్వాత జన్మించి ఉండరాదు.
దరఖాస్తు చేసుకున్న వారిని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 200 అబ్జెక్టివ్ ప్రశ్నలు(ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్) అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. మెడికల్ ఫిట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.20వేలు (బేసిక్) ఉంటుంది. అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, మీల్ అలవెన్స్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇవి నగరాన్ని బట్టి మారుతుంటాయి. మొత్తంగా వార్షికంగా సుమారు రూ.4.64 లక్షల నుంచి రూ.4.98 లక్షల వరకు వేతనం ఉంటుంది. అంటే నెలకు రూ.38,709 నుంచి రూ.41,509 వరకు ఉంటుంది. పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు, ఇన్‌క్రిమెంట్లు లభిస్తాయి.
ముఖ్యమైన వివరాలు
పోస్టులు : జూనియర్ అసిస్టెంట్
ఖాళీలు : 180
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
ఎడిట్ అవకాశం: ఏప్రిల్ 30, 2026
హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 15వ తేదీ వరకు
పరీక్ తేదీ: 2026 జూన్ మొదటి వారంలో
దరఖాస్తు రుసుము: రూ.800+జీఎస్టీ
ఆసక్తి గల అభ్యర్థులు LIC HFL అధికారిక వెబ్‌సైట్‌లోని careers విభాగం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ముందు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలని, తప్పులు ఉంటే అర్హత కోల్పోయే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
