UPSC | ఐఈఎస్/ ఐఎస్ఎస్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • Publish Date - April 13, 2024 / 11:03 AM IST

UPSC | యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎక‌నామిక్స్/ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసుల్లో జూనియ‌ర్ టైం స్కేల్ ఖాళీల భ‌ర్తీకి సంబంధించి ఇండియ‌న్ ఎక‌నామిక్ స‌ర్వీస్/ ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్ -2024 నిర్వ‌హించ‌నుంది. మొత్తం పోస్టుల సంఖ్య 48 కాగా, ఇందులో ఇండియ‌న్ ఎక‌నామిక్ స‌ర్వీస్ 18, ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌లో 30 ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

అర్హ‌త‌లు :

ఎక‌నామిక్ స‌ర్వీస్‌కు పీజీ(ఎక‌నామిక్స్/ అప్ల‌యిడ్ ఎక‌నామిక్స్ / బిజినెస్ ఎక‌నామిక్స్ / ఎక‌నామెట్రిక్స్), స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్/ మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్/ అప్ల‌యిడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్/ అప్ల‌యిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వ‌యో ప‌రిమితి : ఆగ‌స్టు 1, 2024 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుము : రూ. 200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు చెల్లింపు నుంచి మిన‌హాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ : ఏప్రిల్ 30, 2024
రాత‌ప‌రీక్ష తేదీ : జూన్ 21, 2024
ప‌రీక్షా కేంద్రం : హైద‌రాబాద్
వెబ్‌సైట్ : upsc.gov.in

Latest News