Aamani| ఆరు సార్లు అబార్షన్.. దారుణమైన పరిస్థితులు చూశానంటూ ఆమని షాకింగ్ కామెంట్స్
Aamani| తెలుగు సినీ ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన హీరోయిన్స్‌లో ఆమని ఒకరు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈమె ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. సీనియర్ హీరోలందరితో నటించిన ఆమని.. హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్
Aamani| తెలుగు సినీ ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన హీరోయిన్స్‌లో ఆమని ఒకరు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈమె ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. సీనియర్ హీరోలందరితో నటించిన ఆమని.. హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకి పూర్తిగా దూరంగా ఉన్న ఆమని సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లిగా, అత్తగా పాత్రలు పోషిస్తుంది. మరోవైపు వెండితెరపై ఆమనికి అవకాశాలు వస్తున్నా కూడా, బుల్లితెరపై మాత్రం తెగ సందడి చేస్తుంది. ఇక ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

డైరెక్టర్ బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో నటించిన ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిగా అందుకున్నారు. ఇక తెలుగులో శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతగానో అలరించింది. అయితే ఆమని కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలో తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్ వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే ఆమని తన భర్త నుండి విడిపోయి ఇప్పుడు విడిగా ఉంటుంది. తనకు సినిమాలు అంటే ఇష్టమని, తన భర్త వ్యాపారాలలో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చంది. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉన్నాం. పిల్లలు నా దగ్గరే ఉన్నారు. సినిమాలు, పిల్లలే తన ప్రపంచం అని ఆమని చెప్పుకొచ్చింది.
ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమని తన అబార్షన్స్ గురించి చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా చేసేటప్పుడు చాలా డైట్ చేసేదట. చాలా తక్కువగా తినడం, మార్నింగ్ జస్ట్ జ్యూస్‌లు తాగడం చేయడం వలన బ్లడ్ డెఫీషియన్సీ వచ్చిందట. ప్రోటీన్ ఎస్ అనేది తక్కువగా ఉందని, దాని వలన తనకు తొందరగా పిల్లలు పుట్టలేదని పేర్కొంది. ఆరు సార్లు అబార్షన్ అయిందని, గర్భం ఎందుకు నిలవలేదో అర్ధం కాలేదు. డాక్టర్స్‌కి కూడా నా సమస్య అర్ధం కాలేదు. ఓ డాక్టర్ అయితే ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదని అన్నారు. అయితే ఫైనల్‌గా సమస్యని గుర్తించాక ట్రీట్‌మెంట్ తీసుకున్నానని, ఆ తర్వాత పిల్లలు పుట్టినట్టు తెలిపింది ఆమని. ఇలా ఆరు సార్లు అబార్షన్ కారణంగా తనకి నరకం కనిపించిందని ఆమని స్పష్టం చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram