ప్రియమిత్రుడు రామ్ చరణ్ కోసం అఖిల్ షాకింగ్ నిర్ణయం… ‘లెనిన్’ మళ్లీ వాయిదా!

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం జూన్ 26కు వాయిదా పడింది. సన్నిహితుడు రామ్​ చరణ్​ సినిమాతో రిలీజ్ క్లాష్ నివారించేందుకు అఖిల్​ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Akhil Akkineni Lenin look and Ram Charan Peddi look split image showing release clash

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ వాయిదా—స్నేహం ముందు క్లాష్‌కు చెక్

Akhil Akkineni Delays ‘Lenin’ for Dearest Ram Charan, Avoids ‘Peddi’ Clash

 విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:

Akhil Akkineni LENIN: నటిస్తున్న ‘లెనిన్’ సినిమా మరోసారి వాయిదా పడింది. మొదట మే 1న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జూన్ 26కు మార్చారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం రామ్ చరణ్​ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తలెత్తకుండా ఉండేందుకు ‘లెనిన్’ టీమ్ ముందుగానే విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది.

రామ్ చరణ్​తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని అఖిల్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, విడిగా విడుదల చేస్తే రెండింటికీ మంచి అవకాశాలు ఉంటాయని నిర్మాతలు భావించారు.

లెనిన్ : యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు

‘లెనిన్’లో భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్— శ్రీలీల తప్పుకోవడంతో భాగ్యశ్రీని వరించిన అవకాశం

ఈ చిత్రాన్ని మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తుండగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది.

సంగీతాన్ని ఎస్​ఎస్​ థమన్​ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్)తో పాటు అక్కినేని నాగార్జున నిర్వర్తిస్తున్నారు. థియేటర్లలో మంచి అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తున్నామని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

ఖిల్​ ఊర మాస్​ లుక్​ : మారిన హీరోయిన్​

ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏడాది విరామం తర్వాత అఖిల్ ఈ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, అతని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఒక నిమిషం గ్లింప్స్‌లో అఖిల్ రగ్గడ్ లుక్‌లో కనిపించడం—తన గత ప్రేమకథల ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.

టీజర్‌లో ప్రారంభంలో శ్రీలీల కథానాయికగా కనిపించినా, ఆ తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ మార్పు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కెరీర్‌లో కీలక చిత్రంగా ‘లెనిన్’ నిలవనుందని భావిస్తున్నారు.

Latest News