iBomma Case | వందకుపైగా పైరసీ వెబ్‌సైట్ల నెట్‌వర్క్ – వీడు మామూలోడు కాదు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ చేసిన విచారణలో 100+ వెబ్‌సైట్లు, 21,000 సినిమాలు, ₹20 కోట్లు సంపాదన, 50 లక్షల యూజర్ల డేటా వంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

100+ Piracy Sites, 21,000 Movies – Shocking Revelations on iBomma Ravi

100+ Piracy Sites, 21,000 Movies – Shocking Revelations on iBomma Ravi

‘ఐబొమ్మ’ ఇమ్మడి రవి దగ్గర 21 వేల సినిమాలు, 50 లక్షల యూజర్ల డేటా

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత, రోజు రోజుకు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. రవి కేవలం ఒకే వెబ్‌సైట్‌ను కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కొన్నేళ్లుగా భారీ పైరసీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు పోలీసులు ధృవీకరించారు.

చంచల్‌గూడ జైలులో రవిని సమగ్రంగా విచారిస్తున్న పోలీసులు అతడు నిర్వహించిన నెట్‌వర్క్ పరిమాణాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారిక వివరాల ప్రకారం:

సైబర్ క్రైమ్ టీమ్ ఈ డేటా మొత్తం‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించింది. రవిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి.

దిమ్మదిరిగే విషయాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్

టాలీవుడ్ పెద్దలైన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు సీపీ సజ్జనార్‌ను కలిసిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరిన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను బయటపెట్టాయి. ఆయన అందించిన వివరాల ప్రకారం,

రవి అరెస్ట్ తరువాత, పోలీసులు అతడితోనే ఐబొమ్మను డిలీట్ చేయించారు. అరెస్ట్ తర్వాత రెండో రోజే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో మెసేజ్ కనిపించింది: మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం… క్షమించండి.” ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వాడిది వాళ్లమ్మలా క్రిమినల్ బ్రెయిన్ : రవి తండ్రి అప్పారావు

ఇమ్మడి రవి అరెస్టుపై అతడి తండ్రి అప్పారావు చేసిన వ్యాఖ్యలు మరో కోణాన్ని బయటపెట్టాయి. ఆయన చెప్పిందాని ప్రకారం,

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రచర్చకు దారితీశాయి.