Bharata Varsha | గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ మూవీ

Bharata Varsha | యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్‌లో 33వ చిత్రంగా తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భరతవర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ విడుదలతోనే ఈ సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో గుర్రాలపై యుద్ధ సన్నివేశాలు, కత్తులతో సాగుతున్న పోరాటాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగించేలా ఉన్నాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్‌గా గ్రాండ్‌గా ఉండబోతుందని గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. గోపీచంద్ యోధుడిగా కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

విభిన్న‌మైన కాన్సెప్ట్‌..

ఈ సినిమాలో గోపీచంద్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. కథలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉండనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి గతంలో తెరకెక్కించిన ఘాజీ, అంతరిక్షం వంటి సినిమాలు సాంకేతికంగా, కథాపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఆయన ‘భరతవర్ష’తో మరో విభిన్నమైన కాన్సెప్ట్‌ను తీసుకొస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా, సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. కథ, సాంకేతికత, యాక్షన్ అన్నీ కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. వరుస పరాజయాల తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్‌కు ‘భరతవర్ష’ కీలకంగా మారనుంది. టైటిల్ గ్లింప్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ చిత్రం ఆయనకు బలమైన కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Latest News