Mazaka: సొమ్మ‌సిల్లిపోతున్నావే.. మ‌జాకా నుంచి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌

  • By: sr    latest    Feb 21, 2025 11:05 PM IST
Mazaka: సొమ్మ‌సిల్లిపోతున్నావే.. మ‌జాకా నుంచి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌

విధాత‌: ధ‌మాకా వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత త్రిన‌థ‌రావు న‌క్కిన (Thrinadha Rao Nakkina) ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన‌ చిత్రం మ‌జాకా (Mazaka). సందీప్ కిష‌న్ (Sundeep Kishn), రావు ర‌మేశ్ (Rao Ramesh), రీతూ వ‌ర్మ (Ritu Varma), అన్షు (Anshu) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి26 ( Feb 26th) న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి హాస్య మూవీస్ నిర్మించ‌గా జీ స్టూడియో స‌మ‌ర్పిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన‌ టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకోగా తాజాగా శుక్ర‌వారం సినిమా నుంచి సొమ్మ‌సిల్లి పోతున్నావే అంటూ సాగే మ‌రో మాస్ బీట్‌ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. రాము రాథోడ్‌ (Ramu Rathod), ప్ర‌స‌న్న కుమాన్ బెజ‌వాడ (Prasanna Kumar Bezawada)లు ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా లియోన్ జేమ్స్ (Leon James) సంగీతం అందించారు. రేవంత్‌ అల‌పించాడు.